Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 50:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, మర్దూకు దేవత పడవేయబడుతుంది. బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 –జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 దేశాల్లో, జాతుల్లో ప్రకటించండి. అందరూ వినేలా చేయండి. వాళ్ళు వినడానికి సూచనగా ఒక జెండాను ఎత్తి ఉంచండి. దాన్ని కనబడనివ్వండి. ఇలా చెప్పండి. “బబులోనును ఆక్రమించుకున్నారు. బేలు దేవుడికి అవమానం కలిగింది. మెరోదకు దేవుడికి వ్యాకులం కలిగింది. వాళ్ళ విగ్రహాలకు అవమానం కలిగింది., వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పతనమయ్యాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 “అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి! జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి! పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి, ‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది. బేలు దైవం అవమానపర్చబడుతుంది. మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది. బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి. దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, మర్దూకు దేవత పడవేయబడుతుంది. బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 50:2
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

మనుష్యులందరు భయపడతారు; దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.


దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.


వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!


ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి, ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.


చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, కేకలు వేసి వారిని పిలువండి; ప్రజల ప్రధానులను గుమ్మాల్లో చేతులతో సైగ చేయండి.


చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”


వారు వారి దేవుళ్ళను అగ్నిలో వేసి నాశనం చేశారు, ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు, కేవలం మనుషుల చేతులతో చేసిన కర్ర, రాళ్లు మాత్రమే.


ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోను రాజైన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసి, తిరిగి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాలు, కానుక పంపాడు.


బేలు మోకరిస్తుంది, నెబో క్రిందికి వంగుతుంది. వాటి విగ్రహాలను బరువులు మోసే జంతువులు మోస్తాయి. ఆ బరువైన ప్రతిమలను మోయడం కష్టం, అలసిపోయిన పశువులకు భారము.


బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.


నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. అవి నిజమని నీవు ఒప్పుకోవా? “నీకు తెలియకుండా దాచబడిన క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.


“వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”


అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.


“జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’


“దేశాలకు ఈ విషయం చెప్పండి, యెరూషలేము గురించి ఇలా ప్రకటించండి: ‘దూరదేశం నుండి ముట్టడి చేస్తున్న సైన్యం, యూదా పట్టణాలకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేస్తుంది.


సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి! ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి! నేను ఉత్తరం నుండి విపత్తును, భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.”


“ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’


బబులోను పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; వారి మొర దేశాల్లో ప్రతిధ్వనిస్తుంది.


బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! రక్షకభటులను బలపరచండి, కావలివారిని నిలబెట్టండి, మాటుగాండ్రను సిద్ధం చేయండి! యెహోవా తన ఉద్దేశాన్ని, బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు.


“దేశంలో ఒక జెండా ఎత్తండి! దేశాల మధ్య బాకా ఊదండి! దానితో యుద్ధానికి జనాలను సిద్ధపరచండి; దాని మీద దాడి చేయడానికి: అరారతు, మిన్ని అష్కెనజు. దానికి వ్యతిరేకంగా సేనాధిపతిని నియమించండి; మిడతల దండులా గుర్రాలను పంపండి.


అతని పట్టణమంతా స్వాధీనం చేసుకోబడిందని బబులోను రాజుకు తెలియజేయడానికి, ఒక వార్తాహరుని వెంట మరో వార్తాహరుడు, ఒక దూత వెంట మరో దూత పరుగు పెడుతున్నారు.


నేను బబులోనులో బేలును శిక్షిస్తాను అతడు మ్రింగివేసిన దాన్ని బయటకు కక్కేలా చేస్తాను. దేశాలు అతని దగ్గరకు ఇక గుంపులుగా రావు. బబులోను గోడ కూలిపోతుంది.


ఎందుకంటే నేను బబులోను విగ్రహాలను శిక్షించే సమయం తప్పకుండా వస్తుంది; దాని దేశమంతా అవమానించబడుతుంది చనిపోయిన దాని ప్రజలు దానిలోనే పడిపోయి ఉంటారు.


యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “రాబోయే రోజుల్లో, నేను దాని విగ్రహాలను శిక్షిస్తాను, దాని దేశమంతటా గాయపడినవారు మూల్గుతారు.


బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.


యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, పన్నెండవ నెల ఇరవై అయిదవ రోజున, అతడు యూదా రాజైన యెహోయాకీనును జైలు నుండి విడుదల చేశాడు.


కాబట్టి జనులారా, వినండి; సాక్షులైన మీరు, వారికి ఏమి జరుగుతుందో గమనించండి.


ప్రభువు నెబుకద్నెజరు చేతికి యూదా రాజైన యెహోయాకీమును, దేవుని ఆలయపు పరికరాలతో పాటు అప్పగించారు. బబులోను రాజు వాటిని తన బబులోనియా దేవుని గుడికి తీసుకెళ్లి వాటిని తన దేవుని ధనాగారంలో ఉంచాడు.


అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా?


ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు. ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి, ఆయనకు నమస్కారం చేస్తారు.


అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ