Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 50:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను, వారు కర్మెలు బాషాను మీద మేస్తారు. ఎఫ్రాయిం గిలాదు కొండలమీద వారు తృప్తి చెందుతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదనువారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు సంతుష్టినొందును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 ఇశ్రాయేలును తన స్వదేశానికి నేను చేరుస్తాను. అతడు కర్మెలు, బాషానులపై మేత మేస్తాడు. ఎఫ్రాయిము, గిలాదు మన్య ప్రాంతాల ద్వారా అతడు తృప్తి చెందుతాడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 “‘కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను. అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు. అతడు తిని, తృప్తి పొందుతాడు. ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను, వారు కర్మెలు బాషాను మీద మేస్తారు. ఎఫ్రాయిం గిలాదు కొండలమీద వారు తృప్తి చెందుతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 50:19
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి,


నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు; అవి నన్ను వశపరచుకుంటాయి. నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి.


దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.


ఒక్కసారిగా విచ్చుకుంటుంది; అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; వారు యెహోవా మహిమను మన దేవుని వైభవాన్ని చూస్తారు.


“నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి.


ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.


“ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.


ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.


నేను యాజకులను సమృద్ధితో తృప్తిపరుస్తాను, నా ప్రజలు నా సమృద్ధితో నింపబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


అలసినవారికి అలసట తీరుస్తాను, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను.”


ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.”


నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను.


“నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలూ, కలవరపడకు. నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.


“నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలు; వారి కాపరులు వారిని తప్పుత్రోవ పట్టించి వారిని పర్వతాలమీద తిరిగేలా చేశారు. వారు పర్వతాలు, కొండలమీద తిరుగుతూ, తమ సొంత విశ్రాంతి స్థలాన్ని మరచిపోయారు.


“వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’


“ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను.


“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మిమ్మల్ని మీ పాపాలన్నిటి నుండి శుద్ధి చేసే రోజున మీరు తిరిగి మీ పట్టణాల్లో నివసించేలా చేస్తాను; శిథిలమైన పట్టణాలు తిరిగి కట్టబడతాయి.


చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.


తూర్పు వైపున సరిహద్దు హౌరాను దమస్కు మధ్య, గిలాదు ఇశ్రాయేలు దేశాల మధ్య యొర్దాను వెంట, మృత సముద్రం, తామారు వరకు ఉంటుంది. ఇది తూర్పు సరిహద్దు అవుతుంది.


మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, వారు మీ వారసత్వపు మంద, వారు అడవిలో ఒంటరిగా, సారవంతమైన పచ్చికబయళ్లలో నివసిస్తున్నారు. పూర్వకాలంలో మేసినట్లు వారిని బాషాను, గిలాదులో మేస్తారు.


మీలాంటి దేవుడెవరు? మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు, మీరు నిత్యం కోపంతో ఉండరు కాని దయ చూపడంలో ఆనందిస్తారు.


నేను వారిని ఈజిప్టు నుండి తిరిగి తీసుకువస్తాను అష్షూరు దేశం నుండి సమకూరుస్తాను. నేను వారిని గిలాదు, లెబానోను దేశాలకు తీసుకువస్తాను అక్కడ ఉన్న స్థలం వారికి సరిపోదు.


చాలా ఎక్కువ పశువుల మందలు కలిగిన రూబేనీయులు, గాదీయులు తమ పశువులకు యాజెరు, గిలాదు ప్రాంతాలు తగిన స్థలాలని చూశారు.


ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన స్థలం పశువులకు తగిన స్థలాలు, మీ సేవకులమైన మాకు పశువులు ఉన్నాయి.


యెహోషువ, “ఒకవేళ మీరు చాలామంది ఉండి ఎఫ్రాయిం కొండ ప్రాంతం మీకు ఇరుకుగా అనిపిస్తే అడవిలోకి వెళ్లి, పెరిజ్జీయులు రెఫాయీయుల దేశంలో మీ కోసం భూమిని ఖాళీ చేసుకోండి” అని వారికి చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ