Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 45:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలన నాల్గవ సంవత్సరంలో యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలను నేరియా కుమారుడైన బారూకు గ్రంథపుచుట్టలో వ్రాసినప్పుడు, యిర్మీయా బారూకుతో ఇలా అన్నాడు:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యూదారాజును యోషీయా కుమారుడునైన . యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన యిర్మీయా అతనితో చెప్పినది

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఇది యిర్మీయా ప్రవక్త నేరీయా కొడుకు బారూకుతో పలికిన మాట. యోషీయా కొడుకూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో ఇది జరిగింది. ఈ మాటలు యిర్మీయా చెప్తుండగా బారూకు రాశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 యెహోయాకీము యోషియా కుమారుడు. యూదాలో రాజైన యెహోయాకీము పాలన నాల్గవ సంవత్సరం జరుగుతూ ఉండగా ప్రవక్తయైన యిర్మీయా ఈ విషయాలను నేరీయా కుమారుడైన బారూకుతో చెప్పాడు. బారూకు ఈ విషయాలను పుస్తక రూపంలో వ్రాశాడు. యిర్మీయా బారూకుకు చెప్పినది ఇది:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలన నాల్గవ సంవత్సరంలో యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలను నేరియా కుమారుడైన బారూకు గ్రంథపుచుట్టలో వ్రాసినప్పుడు, యిర్మీయా బారూకుతో ఇలా అన్నాడు:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 45:1
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోయాకీము పరిపాలన కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు దేశం మీదికి వచ్చాడు, యెహోయాకీము అతనికి లొంగిపోయి, మూడేళ్ళు సామంతుడిగా ఉన్నాడు. తర్వాత అతడు నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు.


యెహోయాకీము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.


యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.


యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలన ప్రారంభంలో, యెహోవా నుండి ఈ మాట వచ్చింది:


నేను ఈ పత్రాన్ని నా బంధువు హనామేలు సమక్షంలో, అలాగే పత్రంపై సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కావలివారి ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి సమక్షంలో మహశేయా కుమారుడైన నేరియా, అతని కుమారుడైన బారూకుకు ఇచ్చాను.


“నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను:


యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో నాలుగో సంవత్సరంలో, యిర్మీయాకు యెహోవా నుండి ఈ మాట వచ్చింది:


“ఒక గ్రంథపుచుట్ట తీసుకుని యూదా, ఇశ్రాయేలు, ఇతర జనాంగాల గురించి యోషీయా పాలనలో నీతో మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ దానిలో వ్రాయి.


పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.


కాబట్టి యిర్మీయా మరో గ్రంథపుచుట్టను తీసుకుని నేరియా కుమారుడైన బారూకు అనే లేఖికునికి ఇచ్చి, యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపుచుట్టలోని మాటలన్నిటిని యిర్మీయా చెప్తూ ఉండగా, బారూకు దానిపై వ్రాశాడు. ఆ మాటలతో పాటు అలాంటి అనేక మాటలను వ్రాశాడు.


కాబట్టి యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలిచి, యెహోవా తనతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా చెప్తుండగా, బారూకు వాటిని గ్రంథపుచుట్ట మీద వ్రాశాడు.


“బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో ఇలా అంటున్నారు:


ఈజిప్టును గురించి: యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:


యూదా రాజైన సిద్కియా పాలనలోని నాల్గవ సంవత్సరంలో మహశేయా మనుమడును నేరియా కుమారుడును రాజు వసతిగృహ అధికారియునైన శెరాయా, రాజైన సిద్కియాతో కలిసి బబులోనుకు వెళ్లినప్పుడు, ప్రవక్తయైన యిర్మీయా ఈ సందేశాన్ని అతనికి ఇచ్చాడు.


యూదా రాజైన యెహోయాకీము పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దానిని ముట్టడించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ