యిర్మీయా 44:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు. အခန်းကိုကြည့်ပါ။ |
ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు. “అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి!