Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 44:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసముచేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఐగుప్తు లోని మిగ్దోలు, తహపనేసు, నొపు, పత్రోసు నగరాల్లో నివాసమున్న యూదా ప్రజలందరిని గూర్చి యిర్మీయా వద్దకు వచ్చిన దేవుని వాక్యం ఇది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ వర్తమానం మిగ్దోలు, తహపనేసు, నొపు పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివసిస్తున్న యూదా వారికై ఇవ్వబడింది. ఆ సందేశం ఇలా ఉంది:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 44:1
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.


“ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు.


ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.


సోయను అధిపతులు మూర్ఖులయ్యారు, మెంఫిసు నాయకులు మోసపోయారు. ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు దానిని దారి తప్పేలా చేశారు.


అలాగే, మెంఫిసు, తహ్పన్హేసు పట్టణస్థులు, నీ పుర్రె పగులగొట్టారు.


“ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.


అక్కడ ఈజిప్టులోని బేత్-షెమెషులో ఉన్న సూర్య దేవాలయంలో పవిత్ర స్తంభాలను పడగొట్టి, ఈజిప్టు దేవతల ఆలయాలను కాల్చివేస్తాడు.’ ”


అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తున్నారని తెలిసిన పురుషులు, అక్కడ ఉన్న స్త్రీలందరు పెద్ద సమాజంగా చేరి దిగువ ఎగువ ఈజిప్టులో అనగా పత్రూసులో నివసిస్తున్న ప్రజలందరూ యిర్మీయాతో ఇలా అన్నారు,


“ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’


ఈజిప్టులో నివసించేవారలారా, బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి, ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి, నివాసులు లేక శిథిలమవుతుంది.


నేను నీకు నీ నదికి విరోధిని అయ్యాను. ఈజిప్టు దేశాన్ని మిగ్దోలు నుండి సైనే వరకు కూషు సరిహద్దు వరకు పూర్తిగా పాడుచేసి ఎడారిగా చేస్తాను.


బందీ నుండి వారిని తీసుకువచ్చి దక్షిణ ఈజిప్టులోని పత్రూసు అనేవారి పూర్వికుల దేశానికి వారిని రప్పిస్తాను. అక్కడ వారు ఒక అల్పమైన రాజ్యంగా ఏర్పడతారు.


“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘విగ్రహాలను నాశనం చేసి మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను. ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు, ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.


పత్రూసు పాడుచేస్తాను, సోయనులో అగ్ని పుట్టిస్తాను తేబేసుకు శిక్ష విధిస్తాను.


ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను. సీను వేదనతో మెలికలు తిరుగుతుంది. తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది; మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.


ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడు తహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది; దాని బల గర్వం అణచివేయబడుతుంది. దానిని మబ్బులు క్రమ్ముతాయి దాని కుమార్తెలు బందీగా వెళ్తారు.


వారు నాశనాన్ని తప్పించుకున్నా సరే, ఈజిప్టువారిని సమకూరుస్తుంది, మెంఫిసు వారిని పాతిపెడుతుంది. వారికి ప్రియమైన వెండి వస్తువులను దురదగొండ్లు ఆక్రమిస్తాయి, వారి గుడారాలు ముళ్ళతో నిండుతాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ