Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 43:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్య అధికారులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండాలి అనే యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనలయధిపతులందరును ప్రజలందరును యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఈ విధంగా కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ, ఇంకా ప్రజలందరూ యూదా దేశంలో నివసించమన్న దేవుని మాట వినలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 కావున యోహానాను, సైనికాధికారులు, ఇతర ప్రజలు ప్రభువాజ్ఞ తిరస్కరించారు. యెహోవా వారిని యూదాలో వుండమని ఆజ్ఞ ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్య అధికారులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండాలి అనే యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 43:4
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు బబులోనీయుల భయానికి చిన్నవారి నుండి గొప్పవారి వరకు, సైనికులు అధిపతులతో సహా ప్రజలంతా ఈజిప్టుకు పారిపోయారు.


ప్రవక్త తనతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు, “నిన్ను రాజుకు సలహాదారునిగా నియమించామా? ఆపు! ఎందుకు చావాలనుకుంటున్నావు?” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త, “నీవు అప్పుడు అలా చేసి, ఇప్పుడు నా సలహా అంగీకరించలేదు కాబట్టి దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడని నాకు తెలుసు” అని చెప్పి ఊరుకున్నాడు.


యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.


కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు.


అప్పుడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను హత్యచేసిన తర్వాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఇష్మాయేలు దగ్గర ప్రాణాలతో మిగిలి ఉన్న ప్రజలందరినీ అనగా గిబియోను నుండి ఇష్మాయేలు తీసుకెళ్లిన సైనికులను, స్త్రీలను, పిల్లలను ఆస్థాన అధికారులను తిరిగి తీసుకువచ్చారు.


ఈ రోజు నేను మీతో చెప్పాను, కానీ మీకు చెప్పమని నన్ను పంపిన వాటన్నిటిలో దేనికి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు.


కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు.


కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఇతర దేవతలకు ధూపం వేయడం ఆపలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ