Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 40:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను–మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అప్పుడు షాఫాను కొడుకు అహీకాము కొడుకు గెదల్యా ప్రమాణంచేసి వాళ్ళతోనూ, వాళ్ళ మనుషులతోనూ ఇలా అన్నాడు. “మీరు కల్దీయులను సేవించడానికి భయపడవద్దు. దేశంలో కాపురం ఉండి, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 40:9
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు తన విశ్రాంతి స్థలం ఎంత మంచిదో, అతని నేల ఎంత ఆహ్లాదకరమో చూసినప్పుడు, అతడు భుజం వంచి శ్రమించి, వెట్టిచాకిరికి సమర్పించుకుంటాడు.


గెదల్యా వారికి, వారి మనుష్యులకు ఇలా ప్రమాణం చేశాడు, “బబులోను అధికారులకు భయపడకండి. దేశంలో స్థిరపడి, బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.”


మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.


యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.


అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ”


పట్టణం ఎలా నిర్జనమై ఉంది, ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, కాని ఇప్పుడు బానిసగా మారింది.


ఎడారిలో ఖడ్గం కారణంగా, ప్రాణాలను పణంగా పెట్టి ఆహారం తెచ్చుకుంటున్నాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ