Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 38:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అందుకు రాజైన సిద్కియా, “అతడు మీ ఆధీనంలో ఉన్నాడు, రాజు మీకు వ్యతిరేకంగా ఏమి చేయడు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అందుకు రాజైన సిద్కియా– అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అందుకు రాజైన సిద్కియా “అతడు మీ చేతిలో ఉన్నాడు. రాజు మీకు అడ్డం రాగలడా,” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 “యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అందుకు రాజైన సిద్కియా, “అతడు మీ ఆధీనంలో ఉన్నాడు, రాజు మీకు వ్యతిరేకంగా ఏమి చేయడు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 38:5
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు దావీదు, “సెరూయా కుమారులారా! దీనితో మీకు ఉన్న సంబంధం ఏమిటి? దీనిలో కల్పించుకోడానికి మీకు ఏమి హక్కు? ఇలాంటి సమయంలో మీరు నాకు శత్రువులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలులో ఎవరికైనా మరణశిక్ష విధించడం సరియైనదేనా? ఈ రోజే నేను ఇశ్రాయేలుకు రాజును అని మీకు తెలియదా?” అని చెప్పి,


నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.


మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.


ఇక నా విషయానికొస్తే, నేను మీ చేతుల్లో ఉన్నాను; మీకు ఏది మంచిది, సరియైనది అనిపిస్తే అదే చేయండి.


అప్పుడు రాజైన సిద్కియా అతన్ని పిలిపించి, రాజభవనానికి తీసుకువచ్చి, “యెహోవా నుండి ఏదైనా వాక్కు వచ్చిందా?” అని అడిగాడు. “అవును, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు” అని యిర్మీయా జవాబిచ్చాడు.


అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు.


ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు.


అప్పుడు సౌలు సమూయేలుతో, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను పాటించలేదు. ప్రజలకు భయపడి వారి మాట విన్నాను.


అందుకు ఆకీషు దావీదుతో, “నీవు నా కంటికి దేవదూతలా మంచిగా కనబడుతున్నావు; కాని ఫిలిష్తీయుల దళాధిపతులు, ‘ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు’ అని అంటున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ