యిర్మీయా 35:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు – ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీపితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, ‘ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి’ అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా సేవకులగు ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యాయాలు మీ వద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించవద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించవచ్చు’ అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు తిరస్కరించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။ |