Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 31:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 కాబట్టి నీ సంతానానికి నిరీక్షణ ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “మీ పిల్లలు తమ సొంత దేశానికి తిరిగి వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 “భవిష్యత్తు కోసం నీకు ఒక ఆశ ఉంది. నీ సంతానం తిరిగి తమ సరిహద్దుల్లోకి వస్తారు,” ఇది యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడుము.” ఇది యెహోవా వాక్కు. “నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 కాబట్టి నీ సంతానానికి నిరీక్షణ ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “మీ పిల్లలు తమ సొంత దేశానికి తిరిగి వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 31:17
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా అది కూడా నాశనమవుతుంది. అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత మొద్దులు ఎలా మిగులుతాయో అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.”


కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను.


అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:


యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది.


అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు.


వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను.


నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశంలో అనగా మీ పూర్వికులు నివసించిన దేశంలో వారు నివసిస్తారు. వారు వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసిస్తారు. నా సేవకుడైన దావీదు వారికి శాశ్వతమైన అధిపతిగా ఉంటాడు.


నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు.


అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.


తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు.


నిరీక్షణగల బందీల్లారా, మీ కోటకు తిరిగి రండి. నేను మీకు రెండింతలు మేలు చేస్తానని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.


“ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు, అయితే ఎన్నుకోబడినవారి కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ