యిర్మీయా 30:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ప్రసూతి వేదనతో ఒక పురుషుడు బిడ్డను కనగలడా? మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి యువకుడు తన నడుము మీద చేతులెందుకు పెట్టుకుంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీలా వాళ్ళ ముఖాలు ఎందుకు పాలిపోయాయి? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 “ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము: ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం! అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను? ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది? ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి? အခန်းကိုကြည့်ပါ။ |