Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 25:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ఇంకా తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రానికి అవతలి తీరాల రాజులూ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెతో తాగేలా చేశాను. దూరదేశాపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 25:22
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం: తర్షీషు ఓడలారా! రోదించండి: తూరు నాశనమయ్యింది, అది ఇల్లు గాని ఓడరేవు గాని లేకుండ మిగిలింది. కుప్ర దేశం నుండి ఈ విషయం వారికి తెలియజేయబడింది.


ఒక రాజు జీవితకాలంలా డెబ్బై సంవత్సరాలు తూరు గురించి మరచిపోతారు. అయితే డెబ్బై సంవత్సరాలు ముగింపులో వేశ్యల పాటలో ఉన్నట్లుగా తూరుకు జరుగుతుంది:


సీదోనూ, సముద్రపు కోట సిగ్గుపడండి, సముద్రం ఇలా మాట్లాడింది: “నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లలు కనలేదు, కుమారులను పోషించలేదు కుమార్తెలను పెంచలేదు.”


యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.


“జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’


ఎందుకంటే ఆ రోజు వచ్చింది, ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని తొలగించే రోజు తప్పకుండా వస్తుంది. యెహోవా ఫిలిష్తీయులను, కఫ్తోరు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.


అప్పుడు నీ సంపద, సరుకులు వస్తువులు, నీ నావికులు, ఓడ నాయకులు నీ ఓడలు బాగుచేసేవారు, నీ వ్యాపారులు నీ సైనికులందరూ, నీతో ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఓడ ధ్వంసమైన రోజున సముద్రం మధ్యలో మునిగిపోతారు.


యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:


యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:


“మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గురించి ప్రవచించి ఇలా చెప్పు:


“మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.


“ఉత్తర ప్రాంత అధిపతులందరు, అలాగే సీదోనీయులందరు అక్కడ ఉన్నారు; వారు తమ శక్తి వల్ల భీభత్సం సృష్టించినప్పటికీ చంపబడినవారితో దిగివెళ్లి అవమానానికి గురయ్యారు. వారు ఖడ్గం చేత చంపబడినవారితో సున్నతి పొందని వారిగా పడి ఉన్నారు, పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు.


నేను మాగోగు మీదికి, సముద్ర తీర ప్రాంతాల్లో క్షేమంగా నివసించేవారి మీదికి అగ్ని పంపిస్తాను, అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ