Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 25:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 సంతోషసంబరాల ధ్వనులూ, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్వరాలూ, తిరుగటిరాళ్ల శబ్దం, దీపాల వెలుగూ వారిలో ఉండకుండా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 25:10
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

అదారు అనే పన్నెండవ నెల పదమూడవ రోజున యువకుల నుండి ముసలివారి వరకూ స్త్రీలు, పిల్లలు అని తేడా లేకుండా ఒకే రోజులోనే యూదులనందరిని చంపి నాశనం చేసి, వారి ఆస్తులను దోచుకోవాలని శాసనాలు వార్తాహరుల ద్వారా రాజు సంస్థానాలన్నిటికి పంపబడ్డాయి.


ఎందుకంటే నేను, నా ప్రజలు నాశనం చేయబడడానికి, చంపబడడానికి, నిర్మూలించబడడానికి అమ్మబడ్డాము. ఒకవేళ మేము కేవలం దాసదాసీలుగా అమ్మబడి ఉంటే, నేను మౌనంగా ఉండేదాన్ని, ఎందుకంటే అలాంటి బాధ కోసం రాజును అభ్యంతర పెట్టడం భావ్యం కాదు” అని అన్నది.


రాజు ఆదేశం, యూదులు ప్రతి పట్టణంలో తమను తాము కాపాడుకునే హక్కు కలిగించింది; వారి మీద, వారి స్త్రీల మీద, పిల్లల మీద దాడి చేసే ఏ జాతి వారినైనా, ఏ సంస్థానం వారినైనా, వారు నాశనం చేయవచ్చు, చంపవచ్చు, నిర్మూలించవచ్చు, వారి శత్రువుల ఆస్తిని కొల్లగొట్టవచ్చు.


తిరగలి తీసుకుని పిండి విసురు; నీ ముసుగు తీసివేయి. లంగాలు పైకెత్తి కాలిమీద బట్ట తీసి నదులు దాటు.


ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ కళ్లముందు, మీ రోజుల్లో నేను ఈ స్థలంలో ఆనంద, సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను అంతం చేస్తాను.


మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి ఆనందం, సంతోషం పోయాయి. నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. కేకలు వినిపించినప్పటికీ, అవి ఆనందంతో వేసిన కేకలు కావు.


యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ వధూవరుల స్వరాలను, ఆనంద సంతోష ధ్వనులను నేను అంతం చేస్తాను, ఎందుకంటే దేశం నిర్జనమైపోతుంది.


మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది, మా నాట్యం దుఃఖంగా మారింది.


నేను నీ సంగీతాన్ని ఆపివేస్తాను. నీ సితార శబ్దం ఇకపై వినపడదు.


ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని: ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు, ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ