Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 23:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా వాక్కు ఇదే–నా మందలో చేరిన . గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 “నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.” ఇది యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 23:1
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాపరులు తెలివిలేనివారు వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; కాబట్టి వారు వర్ధిల్లరు వారి మంద అంతా చెదరిపోయింది.


చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు నా పొలాన్ని త్రొక్కివేశారు; వారు నాకు ఇష్టమైన పొలాన్ని నిర్జనమైన బంజరు భూమిలా మార్చారు.


మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను రహస్యంగా ఏడుస్తాను; యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి.


“దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు, ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు; వారు వారి రాజులు వారి అధికారులు, వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు.


యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ అని అడగలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, బయలు పేరిట ప్రవచించారు.


గాలికి నీ కాపరులందరు కొట్టుకుపోతారు, నీ స్నేహితులను బందీలుగా తీసుకెళ్తారు. అప్పుడు నీ దుష్టత్వమంతటిని బట్టి నీవు సిగ్గుపడి అవమానానికి గురవుతావు.


కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను మేపుతున్న గొర్రెల కాపరులతో ఇలా అంటున్నారు: “మీరు నా మందను చెదరగొట్టి వాటిని తరిమివేసి వాటిని పట్టించుకోనందున, మీరు చేసిన దుర్మార్గానికి నేను మీకు శిక్ష విధిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలు; వారి కాపరులు వారిని తప్పుత్రోవ పట్టించి వారిని పర్వతాలమీద తిరిగేలా చేశారు. వారు పర్వతాలు, కొండలమీద తిరుగుతూ, తమ సొంత విశ్రాంతి స్థలాన్ని మరచిపోయారు.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: దర్శనమేమి చూడకపోయినా సొంత ఆత్మను అనుసరించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ.


యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:


మీరు కొమ్ములతో పొడుస్తూ, భుజంతో ప్రక్కలతో తోస్తూ బలహీనమైన గొర్రెలన్నిటిని తరిమికొడుతున్నారు కాబట్టి,


మీరు నా గొర్రెలు, నా పచ్చిక బయళ్లలోని గొర్రెలు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


నియమించబడిన పండుగల్లో యెరూషలేములో అర్పించబడే గొర్రె మందల్లా వారి సంఖ్యను అభివృద్ధి చేస్తాను. అప్పుడు శిథిలమైన పట్టణాలు మనుష్యుల గుంపులతో నిండిపోతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”


“కాపరుల మీద నా కోపం రగులుకుంది, నేను నాయకులను శిక్షిస్తాను; సైన్యాల యెహోవా తన మందయైన యూదా ప్రజల మీద శ్రద్ధ చూపుతారు ఆయన వారిని గర్వించే యుద్ధ గుర్రాల్లా చేస్తారు.


వారిని వదిలిపెట్టండి; వారు గ్రుడ్డి మార్గదర్శకులు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే, వారిద్దరు గుంటలో పడతారు” అన్నారు.


ఆయన జనసమూహాలను చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెలవలె పీడించబడి నిస్సహాయులుగా ఉన్నారని వారి మీద కనికరపడ్డారు.


దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వస్తాడు. అయితే నేను గొర్రెలకు జీవం కలిగించాలని, అది సమృద్ధిగా కలిగించాలని వచ్చాను.


జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది.


నాకన్నా ముందు వచ్చిన వారందరు దొంగలు దోచుకునేవారే. కాబట్టి గొర్రెలు వారి మాటలు వినలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ