Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 21:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; అణచివేసే వారి చేతి నుండి దోచుకోబడిన వానిని విడిపించండి, లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి నా ఉగ్రత అగ్నిలా మండుతూ ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రతిరోజూ న్యాయంగా తీర్పు తీర్చండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే మీపై నా క్రోధం మంటలాగా బయలుదేరుతుంది. ఎవడూ ఆర్పడానికి వీలు లేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది.” ఇది యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి. నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము. నీవది చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం ఎవ్వరూ ఆపలేని దహించు అగ్నిలా ఉంటుంది. మీరు దుష్ట కార్యాలు చేశారు గనుక ఇది జరుగుతుంది.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; అణచివేసే వారి చేతి నుండి దోచుకోబడిన వానిని విడిపించండి, లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి నా ఉగ్రత అగ్నిలా మండుతూ ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 21:12
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు ఇశ్రాయేలంతటిని పరిపాలిస్తూ తన ప్రజలందరికి న్యాయాన్ని ధర్మాన్ని జరిగించాడు.


దుష్టుల కోరలు విరగ్గొట్టాను వారి పళ్ళ నుండి బాధితులను విడిపించాను.


ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని నేను మౌనంగా ఉంచుతాను; యెహోవా పట్టణంలో నుండి కీడు చేసేవారిని పంపివేస్తాను.


మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి తన స్థానంలో కూర్చున్నాడు, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అతని చుట్టూ నిలబడ్డారు.


సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.


బలవంతుడు పీచులా అవుతాడు అతని పని నిప్పురవ్వలా అవుతుంది; అవి రెండూ కలిసి కాలిపోతాయి, మంటను ఆర్పేవారు ఎవరూ ఉండరు.”


అప్పుడు యెషయా, “దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా?


అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి.


నీవు చేసిన తప్పు వల్ల నేను నీకు ఇచ్చిన వారసత్వాన్ని నీవు కోల్పోతావు. నీకు తెలియని దేశంలో నిన్ను నీ శత్రువులకు బానిసగా చేస్తాను, నీవు నా కోపాన్ని రెచ్చగొట్టావు, అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.”


స్వయంగా నేనే భయంకరమైన కోపంతో, మహా ఉగ్రతతో, నా చాపబడిన చేతితో, బలమైన బాహువుతో నీకు వ్యతిరేకంగా పోరాడతాను.


చూడండి, యెహోవా ఉగ్రత తుఫానులా విరుచుకుపడుతుంది, అది సుడిగాలిలా దుష్టుల తలలపైకి దూసుకెళ్తుంది.


కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను మేపుతున్న గొర్రెల కాపరులతో ఇలా అంటున్నారు: “మీరు నా మందను చెదరగొట్టి వాటిని తరిమివేసి వాటిని పట్టించుకోనందున, మీరు చేసిన దుర్మార్గానికి నేను మీకు శిక్ష విధిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“రాబోయే రోజుల్లో, నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను, జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు, దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


బహుశా వారి విన్నపం యెహోవా సన్నిధిలో ఆమోదించబడి, వారు తమ చెడు మార్గాలను విడిచిపెడతారేమో, ఎందుకంటే యెహోవా ఈ ప్రజల మీదకు తీవ్రమైన కోపం ఉగ్రత వస్తాయని ప్రకటించారు.”


మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి, మీ హృదయాలను సున్నతి చేసుకోండి, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, లేకపోతే మీరు చేసిన చెడును బట్టి నా కోపం అగ్నిలా మండుతుంది, ఆర్పడానికి ఎవరూ ఉండరు.


మీ దుష్ట కార్యాలను, మీరు చేసిన అసహ్యకరమైన పనులను యెహోవా ఇక భరించలేనప్పుడు, మీ దేశం నేడు ఉన్నట్లుగా శాపంగా, నివాసులు లేని నిర్జనమైనదిగా మారింది.


కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: “ప్రజలు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి, నేను నీ నోటిలో నా మాటలను అగ్నిగాను ఈ ప్రజలను అది కాల్చివేసే కలపగాను చేస్తాను.


వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. వారి దుర్మార్గాలకు హద్దు లేదు; వారు న్యాయం కోరరు. వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు.


“ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నా కోపం నా ఉగ్రత ఈ స్థలంపై మనుష్యులపై మృగాలపై పొలాల్లో ఉన్న చెట్లపై మీ భూమి పంటలపై కుమ్మరించబడతాయి; అది కాలిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు.


మీరు నిజంగా మీ మార్గాలను, మీ క్రియలను మార్చుకుని ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరిస్తే,


యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, అది దాని పునాదులను దహించివేసింది.


కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”


అప్పుడు నా కోపంలో నేను మీ పట్ల శత్రుత్వం కలిగి ఉంటాను, నేనే మిమ్మల్ని మీ పాపాల కోసం ఇంకా ఏడు రెట్లు శిక్షిస్తాను.


ఆయన ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోగలరు? ఆయన కోపాగ్నిని ఎవరు సహించగలరు? ఆయన ఉగ్రత అగ్నిలా బయటకు కుమ్మరించబడింది; ఆయన ముందు బండలు బద్దలయ్యాయి.


యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.


అయితే యెహోవా నీతిమంతుడు; ఆయన తప్పు చేయరు. అనుదినం ఆయన మానకుండా, ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు.


దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.


మీ మంచి కోసం అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు.


ఎందుకంటే నా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది, పాతాళం వరకు అది మండుతుంది. అది భూమిని దాని పంటను మ్రింగివేస్తుంది పర్వతాల పునాదులకు నిప్పు పెడుతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ