యిర్మీయా 15:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నిన్ను ఈ ప్రజలకు గోడగా, ఇత్తడి కోటగోడగా చేస్తాను; వారు నీతో పోరాడతారు, కాని నిన్ను జయించలేరు, ఎందుకంటే నిన్ను విడిపించి రక్షించడానికి నేను నీతో ఉన్నాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 నేను నిన్ను ఈ ప్రజలకు అభేధ్యమైన కంచుకోటగా చేస్తాను. వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు గాని నిన్ను గెలవలేరు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను. నిన్ను చూచి వారంతా కంచుగోడలాంటి వాడని అనుకుంటారు. యూదావారు నీతో పోట్లాడుతారు. కాని వారు నిన్ను ఓడించలేరు. ఎందువల్లనంటే నేను నీతో వున్నాను. నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నిన్ను ఈ ప్రజలకు గోడగా, ఇత్తడి కోటగోడగా చేస్తాను; వారు నీతో పోరాడతారు, కాని నిన్ను జయించలేరు, ఎందుకంటే నిన్ను విడిపించి రక్షించడానికి నేను నీతో ఉన్నాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |