యిర్మీయా 14:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు; వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు కానీ నీళ్లు దొరకవు. వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు; నిరాశ నిస్పృహలతో, వారు తమ తలలను కప్పుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వారిలో ప్రధానులు బీద వారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువులయొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టికుండలు తీసికొని వారు మరల వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వాళ్ళ నాయకులు తమ పనివాళ్ళను నీళ్ల కోసం పంపుతారు. వాళ్ళు బావుల దగ్గరికి పోతే నీళ్లుండవు. ఖాళీ కుండలతో వాళ్ళు తిరిగి వస్తారు. సిగ్గుతో అవమానంతో తమ తలలు కప్పుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 ప్రజా నాయకులు వారి సేవకులను నీటికొరకు పంపుతారు. సేవకులు జలాశయాల వద్దకు వెళతారు. కాని వారికి నీరు దొరకదు. సేవకులు ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు. దానితో వారు సిగ్గుపడి, కలత చెందుతారు. అవమానంతో వారి తలలు బట్టతో కప్పుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు; వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు కానీ నీళ్లు దొరకవు. వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు; నిరాశ నిస్పృహలతో, వారు తమ తలలను కప్పుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |