Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 13:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అలాగే అందరిని ఒకరిపై ఒకరు పడేలా చేస్తాను, వారిపై దయ కరుణ కనికరం లేకుండా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అప్పుడు నేను తండ్రులూ కొడుకులూ అందరూ కూలిపోయి ఒకడి మీద ఒకడు పడేలా చేస్తాను. వారి మీద జాలీ, కనికరమూ చూపకుండా వారిని నాశనం చేస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.’ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది ‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అలాగే అందరిని ఒకరిపై ఒకరు పడేలా చేస్తాను, వారిపై దయ కరుణ కనికరం లేకుండా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 13:14
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు కొండసీమవారి మీద దాడి చేసి వారిని హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవారిని హతమార్చిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.


వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది.


ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”


దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. వారి సృష్టికర్త వారికి దయ చూపించరు.


“యెరూషలేమా, నీ మీద ఎవరు జాలి చూపిస్తారు? నీకోసం ఎవరు దుఃఖిస్తారు? నీ క్షేమసమాచారం ఎవరు అడుగుతారు?


నీవు నన్ను తిరస్కరించావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీవు విశ్వాసభ్రష్టత్వం కొనసాగిస్తూనే ఉన్నావు. కాబట్టి నేను నా చేయి చాపి నిన్ను నాశనం చేస్తాను; నీ మీద జాలి చూపడానికి నేను అలసిపోయాను.


యెహోవా ఇలా అంటున్నారు: “చనిపోయిన దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్లవద్దు; దుఃఖించడానికీ, సానుభూతి చూపడానికి వెళ్లవద్దు, ఎందుకంటే నేను ఈ ప్రజల నుండి నా సమాధానాన్ని, నా ప్రేమను, నా జాలి వదిలేశాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ఆ తర్వాత, ఈ పట్టణంలో తెగులు, ఖడ్గం కరువు నుండి బయటపడిన యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను, ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతులకు, వారిని చంపాలనుకునే శత్రువుల చేతులకు అప్పగిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. ఆ రాజు వారి మీద దయ, జాలి, కనికరం చూపించకుండ వారిని ఖడ్గంతో చంపుతాడు.’


వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”


పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి, శత్రు రథాల శబ్దానికి వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు; వారి చేతులు బలహీనంగా ఉంటాయి.


యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను, కుండను కుమ్మరించే వారిని పంపినప్పుడు, వారు దాన్ని బయటకు కుమ్మరించి, కుండలను ఖాళీచేసి వాటిని పగలగొడతారు.


కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “ఈ ప్రజల ముందు నేను అడ్డురాళ్లు వేస్తాను. తల్లిదండ్రులు పిల్లలు ఒకే విధంగా వారిపై పొరపాట్లు చేస్తారు; పొరుగువారు స్నేహితులు నశిస్తారు.”


“చిన్నవారు, పెద్దవారు కలిసి వీధుల్లోని దుమ్ములో పడుకుంటారు; నా యువకులు, యువతులు ఖడ్గం చేత చంపబడ్డారు. మీరు కోప్పడిన దినాన మీరు వారిని చంపారు; మీరు జాలి లేకుండా వారిని వధించారు.


“ ‘యెహోవానైన నేను మాట ఇచ్చాను. అది నెరవేర్చే సమయం వచ్చింది. నేను వెనక్కి తీసుకోను; నేను జాలిపడను పశ్చాత్తాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ పనులను బట్టి నీకు శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది! నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను. నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను.


నీ మీద ఏమాత్రం దయ చూపించను నిన్ను వదిలిపెట్టను. నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’


మీమీద ఏమాత్రం దయ చూపించను; మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. “ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’


కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు.


కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు.


నేను వింటుండగా ఆయన మిగిలిన వారితో, “మీరు అతని వెంట పట్టణంలోనికి వెళ్లి దయా కనికరం లేకుండా అందరిని చంపండి.


ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను, ఎందుకంటే, వారు వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు.


ఇకనుండి నేను ఈ దేశ ప్రజలపై కనికరం చూపించను. వారందరిని వారి పొరుగువారి చేతికి, వారి రాజు చేతికి నేను అప్పగిస్తాను. వారు దేశాన్ని పాడుచేస్తారు, నేను వారి చేతుల్లో నుండి ఎవరినీ విడిపించను” అని యెహోవా అంటున్నారు.


“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.


“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.


యెహోవా వారిని క్షమించడానికి ఎన్నటికీ ఇష్టపడరు; ఆయన కోపం, రోషం వారిపై భగ్గుమంటాయి. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ వారి పైకి వస్తాయి, యెహోవా ఆకాశం క్రిందనుండి వారి పేర్లను తుడిచివేస్తారు.


బెన్యామీనులోని గిబియాలో ఉన్న సౌలు గూఢాచారులు సైన్యం అన్నివైపులకు చెదిరిపోవడం చూశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ