Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 11:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు వెళ్లి తాము ధూపం వేసే దేవుళ్ళకు మొరపెట్టుకుంటారు, అయితే విపత్తు వచ్చినప్పుడు వారు ఏమాత్రం సహాయం చేయరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యూదాపట్టణస్థులును యెరూషలేము నివాసులును పోయి తాము ధూపార్పణముచేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు తాము ఎవరికైతే ధూపం వేస్తూ పూజిస్తున్నారో ఆ దేవుళ్ళకు విన్నవించుకుంటారుగానీ వారి ఆపదలో అవి వారిని ఏమాత్రం కాపాడలేవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు వెళ్లి తాము ధూపం వేసే దేవుళ్ళకు మొరపెట్టుకుంటారు, అయితే విపత్తు వచ్చినప్పుడు వారు ఏమాత్రం సహాయం చేయరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 11:12
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ ఆపదకాలంలో ఆహాజు రాజు యెహోవా పట్ల ఇంకా నమ్మకద్రోహం చేశాడు.


“అంతా కలిసి రండి; దేశాల నుండి తప్పించుకు పారిపోయినవారలారా రండి. చెక్క విగ్రహాలను మోస్తూ, రక్షించలేని దేవుళ్ళకు మొరపెట్టే వారికి తెలివిలేదు.


వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు; దాని చోటులో దానిని నిలబెడతారు, ఆ చోటు నుండి అది కదల్లేదు. ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు; వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు.


అయినా నా ప్రజలు నన్ను మరచిపోయారు; పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తున్నారు, వాటివలన వారు తమ జీవితాల్లో తడబడ్డారు పురాతనమైన మార్గాలను వదిలిపెట్టి, సరిగా లేని అడ్డదారుల్లో నడవాలి అనుకున్నారు.


అయితే మీరు మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడున్నారు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడగలిగితే రానివ్వండి! యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో, అంతమంది దేవుళ్ళు ఉన్నారు.


మీరు నివసించడానికి వచ్చిన ఈజిప్టులో ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ, మీ చేతులు చేసిన వాటితో ఎందుకు నా కోపాన్ని రెచ్చగొడుతున్నారు? మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, భూమిపై ఉన్న అన్ని దేశాల మధ్య మిమ్మల్ని మీరు ఒక శాపంగా చేసుకుంటారు, అవమానం పాలవుతారు.


ఆయన ఇలా అంటున్నారు: “వారి దేవుళ్ళు ఎక్కడ, వారు ఆశ్రయంగా ఏర్పరచుకున్న బండ ఎక్కడ,


వారి బలుల క్రొవ్వు తిని వారి పానార్పణల ద్రాక్షరసం త్రాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? మీకు సాయం చేయడానికి వారు లేచెదరు గాక! వారు మీకు ఆశ్రయమిచ్చెదరు గాక!


వెళ్లండి, మీరు ఎంచుకున్న దేవుళ్ళకు వేడుకోండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు అవే మిమ్మల్ని కాపాడతాయేమో!” అని అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ