Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 5:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 యెహోవా దూత, ‘మేరోసును శపించండి, దాని ప్రజలను తీవ్రంగా శపించండి. ఎందుకంటే యెహోవాకు సహాయంగా వారు రాలేదు, శక్తిగల శూరులకు విరుద్ధంగా యెహోవాకు సహాయంగా వారు రాలేదు’ అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 యెహోవాదూత యిట్లనెను –మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతోకూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 యెహోవా దూత ఇలా అన్నాడు ‘మేరోజును శపించండి.’ ‘దాని నివాసులను తప్పనిసరిగా శపించండి. యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు. బలిష్ఠులైన యుద్ధశూరులతో చేసిన యుద్ధంలో యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 “‘మేరోజు అను పట్టణాన్ని శపించండి’ అని యెహోవాదూత చెప్పాడు. ‘వారు యెహోవాకు సహాయం చేసేందుకు, యెహోవాకు సైనికులను ఇచ్చేందుకు రాలేదు గనుక వారిని శపించండి.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 యెహోవా దూత, ‘మేరోసును శపించండి, దాని ప్రజలను తీవ్రంగా శపించండి. ఎందుకంటే యెహోవాకు సహాయంగా వారు రాలేదు, శక్తిగల శూరులకు విరుద్ధంగా యెహోవాకు సహాయంగా వారు రాలేదు’ అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 5:23
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ ప్రక్క భాగాన్ని తెకోవాకు చెందినవారు బాగుచేశారు. అయితే తమ అధిపతుల క్రింద పనిని చేయడానికి వారి అధికారులు ఒప్పుకోలేదు.


నా కోసం దుష్టునికి వ్యతిరేకంగా ఎవరు లేస్తారు? కీడు చేసేవారిని నా కోసం ఎవరు వ్యతిరేకిస్తారు?


“యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు! రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు!


“అప్పుడు ఆయన తన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది వాని దూతల కోసం సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి.


పరిశుద్ధాత్మ శక్తిచేత నేను చెప్పిన మాటలు, చేసిన క్రియలు, అద్భుతాలు, సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను.


ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!


కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.


దేవుని తోటిపనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము.


యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు.


యెహోవా దూత గిల్గాలు నుండి వెళ్లి బోకీముకు వెళ్లి ఇలా అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చి మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపించాను. ‘నేను మీతో చేసిన నా ఒడంబడికను ఎన్నడు మీరను,


అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు.


తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.


ఆమె నఫ్తాలిలోని కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: ‘నీవు వెళ్లి నఫ్తాలి జెబూలూను గోత్రాల నుండి పదివేలమంది మనుష్యులను తాబోరు పర్వతం దగ్గరకు పిలిపించు.


“ప్రాణాలతో మిగిలిన అధిపతులు వచ్చారు; శూరులకు వ్యతిరేకంగా యెహోవా ప్రజలు నా దగ్గరకు వచ్చారు.


యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు.


అతడు సుక్కోతు వారితో, “నా సైనికులకు కొంత ఆహారం ఇవ్వండి; వారు అలసిపోయి ఉన్నారు, నేను ఇంకా మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాను” అన్నాడు.


కాని సుక్కోతు అధికారులు, “జెబహు, సల్మున్నా అనే వారిని మీరు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేమెందుకు ఆహారమివ్వాలి?” అన్నారు.


అక్కడినుండి అతడు పెనూయేలుకు వెళ్లి వారిని కూడా ఆహారం కోసం అలాగే అడిగినప్పుడు, వారు కూడా సుక్కోతు వారిలా జవాబిచ్చారు,


అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు.


సౌలు తనలో తాను, “నా చేయి అతని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చేయి అతని మీద పడాలి” అనుకుని దావీదుతో, “ఈమె నా పెద్దకుమార్తె మేరబు; ఆమెను నీకు భార్యగా చేస్తాను. అయితే నీవు నా కోసం యుద్ధవీరునిగా ఉండి యెహోవా యుద్ధాలను చేస్తూ ఉండాలి” అన్నాడు.


“మీ సేవకురాలి పాపాన్ని క్షమించండి. నా ప్రభువైన మీరు యెహోవా యుద్ధాలను చేస్తున్నారు కాబట్టి నా ప్రభువు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తారు. మీరు జీవించినంతకాలం మీకు కీడు కలుగదు.


ఇప్పుడు నా ప్రభువైన రాజు తన సేవకుని మాటలు వినాలి. ఒకవేళ యెహోవాయే మిమ్మల్ని నా మీదికి రెచ్చగొట్టి ఉంటే, ఆయన నా అర్పణను అంగీకరించును గాక. కానీ ఒకవేళ ఇది మనుష్యుల కుట్ర అయితే అందులో ఉన్నవారిని యెహోవా శపించును గాక! ఈ రోజు వారు యెహోవా వారసత్వంలో నా వాటా నుండి నన్ను వెలివేసి, ‘వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించు’ అని అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ