Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 3:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన వారి కోసం రక్షకునిగా కాలేబు తమ్ముడైన కెనజు కుమారుడైన ఒత్నీయేలును నియమించారు, అతడు వారిని రక్షించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజుయొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు కొడుకు ఒత్నీయేలును ఇశ్రాయేలీయుల కోసం నియమించి వాళ్ళను కాపాడాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 కానీ ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన వారి కోసం రక్షకునిగా కాలేబు తమ్ముడైన కెనజు కుమారుడైన ఒత్నీయేలును నియమించారు, అతడు వారిని రక్షించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 3:9
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి మీరు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించారు. వారు బాధించబడిన సమయంలో మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. మీ గొప్ప కృపను బట్టి వారిని శత్రువు చేతిలో నుండి విడిపించడానికి వారికి విమోచకులను ఇచ్చారు.


వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.


దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు; వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.


కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.


కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.


అప్పుడు ఇశ్రాయేలీయులు, “మేము మా దేవున్ని విడిచి బయలు ప్రతిమలను సేవిస్తూ, మీకు విరోధంగా పాపం చేశాం” అని యెహోవాకు మొరపెట్టారు.


అప్పుడు యెహోవా న్యాయాధిపతులను పుట్టించారు. కాబట్టి వారు దోచుకునేవారి చేతిలో నుండి వారిని కాపాడారు.


యెహోవా వారి కోసం న్యాయాధిపతిని పుట్టించినప్పుడు, ఆయన ఆ న్యాయాధిపతితో ఉంటూ, అతడు జీవించినంత కాలం వారిని తమ శత్రువుల చేతిలో నుండి రక్షించారు; ఎందుకంటే శత్రువులు వారిని అణచివేస్తూ బాధిస్తుండగా యెహోవా వారి వేదన చూసి జాలిపడ్డారు.


మరలా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, ఆయన బెన్యామీనీయుడైన గెరా కుమారుడు, ఎడమ చేతివాటం గలవాడైన ఏహూదును రక్షకునిగా వారి కోసం నియమించారు. అతన్ని ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు పన్ను చెల్లించడానికి పంపారు.


యెహోవా కోపం ఇశ్రాయేలుపై మీద రగులుకున్నందుకు ఆయన వారిని అరాము నహరయీము రాజైన కూషన్-రిషాతాయిముకు వారిని అమ్మేశారు, అతనికి వారు ఎనిమిది సంవత్సరాలు దాసులుగా ఉన్నారు.


అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.


మిద్యానును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను వేడుకున్నప్పుడు,


అప్పుడు వారు, ‘మేము యెహోవాను వదిలిపెట్టి బయలు, అష్తారోతు ప్రతిమలను పూజించి పాపం చేశాము. మా శత్రువుల చేతిలో నుండి మీరు మమ్మల్ని విడిపించండి, మేము మిమ్మల్ని సేవిస్తాం’ అని యెహోవాకు మొరపెట్టారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ