న్యాయాధి 3:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 “నన్ను వెంబడించండి, యెహోవా మీ శత్రువైన మోయాబును మీ చేతికి అప్పగించారు” అని అతడు ఆదేశించాడు. కాబట్టి వారతన్ని వెంబడించి, మోయాబు వైపు నడిపించే యొర్దాను రేవులను స్వాధీనపరచుకున్నారు; ఏ ఒక్కరినైన దాటి వెళ్లడానికి వారు అనుమతించలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 అతడు వారికి ముందుగా సాగి వారితో–నా వెంబడి త్వరగా రండి; మీ శత్రువు లైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 అతడు వాళ్ళతో “నాతో రండి, యెహోవా మీ శత్రువులైన మోయాబీయులను ఓడించబోతున్నాడు” అన్నాడు. కాబట్టి వాళ్ళు అతని వెంట దిగివచ్చి మోయాబువారికి ఎదురుగా ఉన్న యొర్దాను రేవులను ఆక్రమించుకుని ఎవరినీ దాటనివ్వలేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 ఏహూదు, “నన్ను వెంబడించండి! మన శత్రువులైన మోయాబు ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే యోర్దాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశంలోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్దాను నదిని దాటనివ్వలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 “నన్ను వెంబడించండి, యెహోవా మీ శత్రువైన మోయాబును మీ చేతికి అప్పగించారు” అని అతడు ఆదేశించాడు. కాబట్టి వారతన్ని వెంబడించి, మోయాబు వైపు నడిపించే యొర్దాను రేవులను స్వాధీనపరచుకున్నారు; ఏ ఒక్కరినైన దాటి వెళ్లడానికి వారు అనుమతించలేదు. အခန်းကိုကြည့်ပါ။ |