Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 21:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యాబేష్గిలాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొని వచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యాబేష్గిలాదు నివాసుల్లో పురుష సాంగత్యం తెలియని నాలుగు వందలమంది స్త్రీలను వాళ్ళు చూసారు. వాళ్ళను కనాను దేశంలోని షిలోహు లో ఉన్న సైన్యం శిబిరానికి తీసుకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 ఆ పన్నెండువేల మంది సైనికులు యాబేష్గిలాదులో నాలుగువందల మంది యువతులు ఏ పురుషునితోను సంభోగించలేదని తెలుసుకున్నారు. ఆ సైనికులు ఆ యువతులను షిలోహు ప్రాంతానికి తీసుకు వచ్చారు. షిలోహు కనాను ప్రదేశంలో ఉన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 21:12
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.


“ ‘షిలోహులో నా పేరు కోసం నేను మొదట నివాసం ఏర్పరచుకున్న ప్రదేశానికి వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసినది ఏంటో చూడండి.


ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సమావేశ గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది,


ఇశ్రాయేలీయులు బేతేలుకు వెళ్లి దేవుని దగ్గర విచారణ చేస్తూ, “బెన్యామీనీయుల మీద యుద్ధానికి మాలో ఎవరు ముందు వెళ్లాలి?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “యూదా వారే ముందు వెళ్లాలి” అన్నారు.


ఇశ్రాయేలీయులు వెళ్లి యెహోవా ఎదుట సాయంత్రం వరకు ఏడ్చి, “మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీదికి మళ్ళీ యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “వారి మీదికి వెళ్లండి” అన్నారు.


వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.


అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు.


తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ