న్యాయాధి 20:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఆహారం తీసుకురావడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నుండి వందమందికి పదిమందిని, వెయ్యిమందికి వందమందిని, పదివేలమందికి వెయ్యిమందిని ఎన్నుకుందాము. అప్పుడు సైన్యం బెన్యామీనులోని గెబాకు చేరుకుంటారు, ఇశ్రాయేలులో వారు చేసిన అవమానకరమైన పనిని బట్టి వారిని శిక్షిస్తారు” అని అన్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఇశ్రాయేలీయులలో జరిగిన వెఱ్ఱితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పదిమంది మనుష్యులను, వెయ్యింటికి నూరుమందిని, పదివేలకు వెయ్యిమందిని ఏర్పరచుకొందము రండని చెప్పు కొనిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఇశ్రాయేలీయుల్లో జరిగిన దుర్మార్గాన్ని శిక్షించడానికై బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ కోసం ఆహారాన్ని సమకూర్చడం కోసం ప్రతి గోత్రం నుండి నూరుమందికి పదిమందినీ, అలాగే వెయ్యికి వందమందినీ పదివేలకు వెయ్యి మందినీ ఏర్పాటు చేద్దాం” అని చెప్పుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 ఇశ్రాయేలు విభిన్న వంశాల నుండి ప్రతి వంద మందిలోనుండి పదిమందిని ఎన్నుకుందాము. ప్రతి వేయి మంది నుండి వంద మందిని ఎన్నుకుందాము. ప్రతి పదివేల మందినుండి వేయి మందిని ఎన్నుకుందాము. మనము ఎంపిక చేసిన ఆ మనుష్యులు సైన్యం కోసం పనులు చేస్తారు. తర్వాత బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరానికి సైన్యం తరలి వెళుతుంది. ఇశ్రాయేలు ప్రజల సైన్యం భయంకరమైన ఈ విషయం జరిపిన ఆ మనుష్యుల్ని శిక్షిస్తుంది.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఆహారం తీసుకురావడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నుండి వందమందికి పదిమందిని, వెయ్యిమందికి వందమందిని, పదివేలమందికి వెయ్యిమందిని ఎన్నుకుందాము. అప్పుడు సైన్యం బెన్యామీనులోని గెబాకు చేరుకుంటారు, ఇశ్రాయేలులో వారు చేసిన అవమానకరమైన పనిని బట్టి వారిని శిక్షిస్తారు” అని అన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |