Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 19:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఆ సాయంత్రం గిబియాలో నివసిస్తున్న ఎఫ్రాయిం కొండ సీమకు చెందిన ఒక వృద్ధుడు పొలాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు (ఆ పట్టణంలో నివసిస్తున్నవారు బెన్యామీనీయులు).

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 ఆ సాయంకాలం పొలంనుంచి ఒక వృద్ధుడు నగరములోనికి వచ్చాడు. అతని ఇల్లు కొండ దేశమయిన ఎఫ్రాయిములో ఉంది. కాని ఇప్పుడతను గిబియా నగరములో నివసిస్తున్నాడు. (గిబియా మనుష్యులు బెన్యామీను వంశమునకు చెందిన వారు).

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఆ సాయంత్రం గిబియాలో నివసిస్తున్న ఎఫ్రాయిం కొండ సీమకు చెందిన ఒక వృద్ధుడు పొలాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు (ఆ పట్టణంలో నివసిస్తున్నవారు బెన్యామీనీయులు).

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 19:16
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నీవు మట్టికి చేరేవరకు, నీ నుదిటి మీద చెమట కార్చి నీ ఆహారాన్ని తింటావు నీవు మట్టివి కాబట్టి తిరిగి మన్నై పోతావు.”


అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు, సాయంకాలం వరకు వారు కష్టపడతారు.


మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.


నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.


ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టిమాటలు దరిద్రమునకు కారణము.


ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో నీ పొలాలను సిద్ధపరచుకో; దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో.


ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు!


శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా, సుఖంగా నిద్రపోతారు, కానీ ధనికులకున్న సమృద్ధి వారికి నిద్రపట్ట నివ్వదు.


గిబియా రోజుల్లో ఉన్నట్లు, వారు అవినీతిలో లోతుగా మునిగిపోయారు. దేవుడు వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాల కోసం వారిని శిక్షిస్తారు.


దొంగతనం చేసేవారు ఇకమీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.


మేము మీతో ఉన్నప్పుడు, “పని చేయనివాడు ఆహారం తినడానికి పాత్రుడు కాడు” అనే నియమాన్ని కూడా మీకు ఇచ్చాము.


ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. అప్పుడు ఎఫ్రాయిం కొండ సీమలో మారుమూల ప్రాంతంలో నివసించే లేవీయుడు ఒకడు యూదాలోని బేత్లెహేముకు లో ఒక ఉంపుడుగత్తెను తెచ్చుకున్నాడు.


కాబట్టి వారు ముందుకు వెళ్తూ ఉండగా బెన్యామీనులోని గిబియాను చేరుకునేటప్పటికి సూర్యాస్తమయం అయ్యింది.


వారు ఆ రాత్రి గడపడానికి గిబియాలో ఆగారు. వారు వెళ్లి పట్టణం మధ్యలో కూర్చున్నారు కాని ఆ రాత్రి ఎవరూ వారిని తమ ఇంట్లోకి ఆహ్వానించలేదు.


ఆ వృద్ధుడు ఊరి మధ్యలో ప్రయాణికున్ని చూసి, “మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు?” అని అడిగాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ