న్యాయాధి 15:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 యూదా ప్రజలు వారిని, “మీరెందుకు మా మీదికి వచ్చారు?” అని అడిగారు. అందుకు వారు, “మేము సంసోను మాకెలా చేశాడో మేము కూడ అతనికి అలాగే చేయడానికి వచ్చాం, మేము అతన్ని బంధించి తీసుకెళ్లడానికి వచ్చాం” అని జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 యూదావారు–మీరేల మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు–సమ్సోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యూదాప్రజలు వారిని “మీరెందుకు మాపై యుద్ధం చేస్తున్నారు?” అని అడిగారు. దానికి ఫిలిష్తీయులు “సంసోనును పట్టుకోడానికే యుద్ధం చేస్తున్నాం. అతడు మాకు చేసినదానికి మేమూ బదులు తీర్చుకోవాలి” అన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని ఇలా ప్రశ్నించారు: “ఫిలిష్తీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?” అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమ్సోనును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా ప్రజలకి చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 యూదా ప్రజలు వారిని, “మీరెందుకు మా మీదికి వచ్చారు?” అని అడిగారు. అందుకు వారు, “మేము సంసోను మాకెలా చేశాడో మేము కూడ అతనికి అలాగే చేయడానికి వచ్చాం, మేము అతన్ని బంధించి తీసుకెళ్లడానికి వచ్చాం” అని జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |