న్యాయాధి 1:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అప్పుడు అదోనీ బెజెకు–తమ కాళ్లు చేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అప్పుడు అదోనీ బెజెకు “ఇలా కాళ్లు, చేతుల బొటన వేళ్ళు కోసిన డెభ్భైమంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకోనేవాళ్ళు. నేను చేసినదానికి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాడు” అన్నాడు. వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు తీసుకొచ్చారు. అతడు అక్కడ చనిపోయాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 అప్పుడు బెజెకు పాలకుడు, “డెబ్బై మంది రాజుల కాళ్లు, చేతుల బొటన వేళ్లను నేను కోసివేసాను. ఆ రాజులు నా బల్ల మీదనుండి క్రింద రాలిన ఆహారం ముక్కలు తినవలసి వచ్చేది. ఆ రాజులకు నేను చేసిన దానిని దేవుడు ఇప్పుడు తిరిగి నాకు చెల్లించాడు” అని చెప్పాడు. బెజెకు పరిపాలకుని యూదా మనుష్యులు యెరూషలేముకు తీసుకొని వెళ్లారు. అతడు అక్కడ మరణించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు. အခန်းကိုကြည့်ပါ။ |