Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 9:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 చీకటిలో జీవిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు; చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. చావు నీడ గల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటిచోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” వారిమీద ప్రకాశిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 చీకటిలో జీవిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు; చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 9:2
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి.


కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు,


ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు, వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు.


మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి.


నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.


మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వారెవరు? వెలుగు లేకుండా ఉంటూ చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని నమ్మి తన దేవునిపై ఆధారపడాలి.


ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.


అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.


ఆయన సప్తర్షి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలను సృష్టించారు, ఆయన మధ్యరాత్రిని ఉదయంగా మారుస్తారు, పగటిని చీకటి చేస్తారు. ఆయన సముద్రంలోని నీటిని రప్పించి. భూమి మీద కుమ్మరిస్తారు ఆయన పేరు యెహోవా.


చీకటిలో నివసిస్తున్న ప్రజలు, గొప్ప వెలుగును చూశారు; మరణచ్ఛాయలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది” అనే మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.


అందుకు యేసు వారితో, “ఇంకా కొంతకాలం మాత్రమే మీ మధ్య వెలుగు ఉంటుంది. చీకటిలో నడిచేవానికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కాబట్టి మిమ్మల్ని చీకటి కమ్ముకోక ముందే వెలుగు ఉన్నప్పుడే నడవండి.


నన్ను నమ్మిన ఏ ఒక్కరు చీకటిలో ఉండకూడదని, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను.


యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.


ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి,


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.


‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా: ప్రతి మనిషికి ఒకరు, లేదా ఇద్దరు స్త్రీలను తీసుకుంటారు, సీసెరాకు దోపుడు సొమ్ముగా రంగువేసిన వస్త్రాలు, కుట్టుపని చేసిన రంగుల వస్త్రాలు, వారి మెడలకు తగిన రెండు వైపులా రంగులు అద్దిన కుట్టుపని చేసిన వస్త్రాలు ఇదంతా దోపుడు సొమ్ముగా తీసుకోలేదా?’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ