యెషయా 66:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెహోవా మాటకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. అయినా వారు సిగ్గుపరచబడతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు –మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెహోవా వాక్కుకు భయపడే వారలారా, ఆయన మాట వినండి. “మీ సోదరులు మిమ్మల్ని ద్వేషిస్తూ నా పేరును బట్టి మిమ్మల్ని తోసేస్తూ ఇలా అన్నారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు ఘనత కలుగు గాక.’ అయితే వాళ్ళు సిగ్గు పాలవుతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా, మీరు యెహోవా చెప్పేవాటిని వినాలి. “మీ సోదరులు మిమ్మల్ని ద్వేషించారు. మీరు నన్ను వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా తిరిగారు. యెహోవా ఘనపరచబడినప్పుడు మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. అప్పుడు మేము మీతోకూడ సంతోషిస్తాం, అని మీ సోదరులు చెప్పారు. ఆ మనుష్యులు శిక్షించబడతారు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెహోవా మాటకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. అయినా వారు సిగ్గుపరచబడతారు. အခန်းကိုကြည့်ပါ။ |