Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 63:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 పూర్వం నుండి మేము మీ వారము; కాని మీరెన్నడు వారిని పాలించలేదు, వారు మీ పేరుతో పిలువబడలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు. ఆ ప్రజలు నీ నామం ధరించరు. మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 పూర్వం నుండి మేము మీ వారము; కాని మీరెన్నడు వారిని పాలించలేదు, వారు మీ పేరుతో పిలువబడలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 63:19
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.


యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.


ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.


మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరట మొరపెట్టని, రాజ్యాల మీద, మీ ఉగ్రతను కుమ్మరించండి.


మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.


మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి!


“నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను; నన్ను వెదకనివారికి నేను దొరికాను. ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అని నా పేరిట మొరపెట్టని దేశంతో చెప్పాను.


మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.


నీవు ఆందోళనకు గురియైన వ్యక్తిలా ఎందుకు ఉన్నావు? రక్షించడానికి శక్తిలేని యోధునిలా ఎందుకు ఉన్నావు? యెహోవా, మీరు మా మధ్య ఉన్నారు, మేము మీ పేరును కలిగి ఉన్నాము; మమ్మల్ని విడిచిపెట్టకండి!


మా దేవా, చెవియొగ్గి ఆలకించండి; మీ కళ్లు తెరిచి, మీ పేరుపెట్టబడిన పట్టణం యొక్క శిథిలావస్తను చూడండి. మేము నీతిమంతులమని కాదు కాని, మీ గొప్ప కరుణను బట్టి మేము మీకు మా విన్నపాలు చేస్తున్నాము.


ప్రభువా ఆలకించండి! ప్రభువా క్షమించండి! నా దేవా మీ కోసం, ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ పట్టణం మీ ప్రజలు మీ పేరు కలిగి ఉన్నారు.”


అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.


గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాల్లో వెళ్లనిచ్చాడు.


అప్పుడు మిగిలిన వారందరు, నా నామం ధరించిన యూదేతరులు కూడ దేవుని వెదకేలా చేస్తాను, అని పూర్వం నుండి తెలియచేయబడిన ఈ కార్యములను,


వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే.


ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు.


అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు.


యెహోవా, మీరు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, మీరు ఎదోము ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది, ఆకాశం కుమ్మరించింది, మేఘాలు నీళ్లు కుమ్మరించాయి.


అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట సీనాయి కంపించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ