Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 62:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు; పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించు నట్లు నీ దేవుడు నిన్నుగూర్చి సంతోషించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు నిన్ను పెళ్లి చేసుకుంటారు. పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు ఆమె అతనికి భార్య అవుతుంది. అదేవిధంగా మీ దేశం మీ పిల్లలకు చెందుతుంది. ఒకడు తన నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు. అదే విధంగా, మీ దేవుడు మీతో ఎంతో సంతోషిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు; పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 62:5
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

బయటకు రండి, సీయోను కుమార్తెలారా, చూడండి, చూడండి, సొలొమోను రాజు కిరీటాన్ని ధరించారు, ఆ కిరీటం ఆయన పెళ్ళి రోజున ఆయన హృదయం ఆనందించిన దినాన ఆయన తల్లి ఆయనకు ధరింపజేసిన కిరీటము.


నా వధువు, లెబానోను నుండి నాతో రా, లెబానోను నుండి నాతో రా. అమాన పర్వత శిఖరం నుండి, శెనీరు, హెర్మోను శిఖరాల నుంచీ, సింహాల బోనుల నుండి, చిరుత పులులు సంచరించే కొండల నుండి దిగిరా.


ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు, నీ దేశం పాడైపోయిందని పిలువబడదు. అయితే నీవు హెఫ్సీబా అని నీ దేశం బ్యూలా అని పిలువబడుతుంది; యెహోవా నీలో ఆనందిస్తారు నీ దేశానికి పెళ్ళి అవుతుంది.


నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను నా ప్రజల్లో ఆనందిస్తాను; ఏడ్పు రోదన శబ్దం ఇకపై దానిలో వినపడవు.


నేను వారికి మేలు చేయడంలో నాకు ఆనందం ఉంది కాబట్టి నిజంగా నా పూర్ణహృదయంతో నా పూర్ణాత్మతో వారిని ఈ దేశంలో నాటుతాను.


నీవు శాశ్వతంగా నాతో ఉండేలా, నేను నిన్ను నీతి, న్యాయంతో, మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను.


“ఆ రోజున నేను జవాబిస్తాను,” అని యెహోవా అంటున్నారు. “నేను ఆకాశాలకు జవాబిస్తాను, అవి భూమికి జవాబిస్తాయి;


నీ దేవుడైన యెహోవా, రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు; ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు, పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.”


“అప్పుడు మీ దేశం ఆనందంగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల ప్రజలు మిమ్మల్ని ధన్యులంటారు” అని సైన్యాలకు యెహోవా ప్రకటిస్తున్నాడు.


మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ