Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 61:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 భూమి మొలకను మొలిపించినట్లు, విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా, అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప జేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 భూమి మొక్కలను మొలిపిస్తుంది. ప్రజలు తోటలో విత్తనాలు చల్లుతారు. ఆ తోట ఆ విత్తనాలను ఎదిగింపజేస్తుంది. అదే విధంగా యెహోవా దయను ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని ఎదిగింప జేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 భూమి మొలకను మొలిపించినట్లు, విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా, అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 61:11
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు దేవుడు, “భూమి వృక్ష సంపదను అనగా విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక” అని అన్నారు. అలాగే జరిగింది.


దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక; కొండల పైభాగాన అది ఆడించబడును గాక. పండ్లచెట్లు లెబానోను చెట్లలా వర్ధిల్లును గాక ప్రజలు పొలం లోని పచ్చికబయళ్లుగా వృద్ధి చెందును గాక.


పర్వతాలు ప్రజలకు వృద్ధిని, కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక.


నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది, నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది.


ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక.


ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది.


నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని నేను నా పేరిట ప్రమాణం చేశాను. నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట ఏదీ వ్యర్థం కాదు.


‘యెహోవాలోనే నీతి, బలము’ అని ప్రజలు నా గురించి చెప్తారు.” ఆయన మీద కోప్పడిన వారందరు ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు.


“పైనున్న ఆకాశాల్లారా, నా నీతిని వర్షింపనివ్వండి; మేఘాలు వాటిని క్రిందికి కురిపించాలి. భూమి విశాలంగా తెరవాలి, రక్షణ మొలవాలి, నీతి దానితో కలిసి వర్ధిల్లాలి; యెహోవానైన నేను దానిని సృష్టించాను.


నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.


నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే నీ సమాధానం నదిలా నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి.


యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు; కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి మీ ఎముకలను బలపరుస్తారు. మీరు నీరు పెట్టిన తోటలా ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు.


ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.


అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.


సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.


దేశాలు నీ నీతిని చూస్తాయి. రాజులందరూ నీ మహిమను చూస్తారు. యెహోవా నీకు ఇవ్వబోయే క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.


యెరూషలేమును స్థాపించే వరకు భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.


అయితే మంచి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని గ్రహించినవారు, వారిలో కొందరు వందరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు ముప్పైరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు.


అప్పుడు ఆయన ఉపమానాలతో వారికి చాలా సంగతులను ఈ విధంగా చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు.


మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, అక్కడ అవి విత్తబడినవాటి కన్న వందరెట్లు, అరవైరెట్లు, ముప్పైరెట్లు అధికంగా పంటనిచ్చాయి.


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ