Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 58:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 “నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా నా సబ్బాతును పాటిస్తే, సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే, దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా, మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 విశ్రాంతి దినాన ప్రయాణం చేయకుండా, నా ప్రతిష్ఠిత దినాన్ని నీ సొంత ఆహ్లాదం కోసం వాడకుండా ఉన్నావనుకో. విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా భావిస్తూ యెహోవాకు చెందిన విషయాలను పవిత్రంగా గౌరవంగా చేస్తున్నావనుకో. నీ సొంత వ్యాపారం వదిలేసి విశ్రాంతి దినాన్ని సొంత ఆహ్లాదం కోసం వాడకుండా నీ సొంత మాటలు మాట్లాడకుండా గౌరవిస్తున్నావనుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 “నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా నా సబ్బాతును పాటిస్తే, సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే, దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా, మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 58:13
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

“యెహోవా ఆలయానికి వెళ్దాం” అని నాతో అన్న వారితో నేను సంతోషించాను.


యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.


ఒకప్పుడు జనసమూహంతో కలిసి పెద్ద ఊరేగింపుగా, ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది.


బయట గడిపిన వెయ్యి దినాలకంటే మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు. దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము.


యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; సజీవుడైన దేవుని కోసం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.


ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి.


సబ్బాతు దినాన మీరు మీ నివాసాల్లో మంట వెలిగించకూడదు.”


“నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు” అని యెహోవా చెప్తున్నారు.


తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం, మా దేవునికి విరుద్ధంగా ఉంటూ, తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం, మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము.


“ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.


“ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.


ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ