Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 57:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 లోయలోని రాళ్ళే మీ భాగం. అవే మీ వంతు. వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యం అర్పిస్తున్నారు. వీటిలో నేను ఆనందించాలా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు ఇష్టం. వాటిని పూజించుటకు మీరు వాటిమీద ద్రాక్షమద్యం పోస్తారు. మీరు వాటికి బలులు ఇస్తారు. కానీ మీకు దొరికేది అంతా ఆ రాళ్లే. ఇది నాకు సంతోషం కలిగిస్తుందని మీరు తలుస్తున్నారా? లేదు! అది నాకు సంతోషం కలిగించదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 57:6
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అయితే యెహోవాను విడిచి, నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి, గాదు దేవునికి బల్లను సిద్ధపరచి, మెనీ దేవునికి ద్రాక్షరస పాత్రలు నింపేవారలారా,


అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;


యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”


ఇశ్రాయేలు అనైతికత ఆమె దృష్టికి చాలా తక్కువ కాబట్టి, ఆమె దేశాన్ని అపవిత్రం చేసింది, రాయితో, కలపతో వ్యభిచారం చేసింది.


ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు.


దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?


అందుకు నేను వారిని శిక్షించవద్దా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోవద్దా?


పిల్లలు కట్టెలు సేకరిస్తారు, తండ్రులు మంట వెలిగిస్తారు, స్త్రీలు పిండిని పిసికి ఆకాశ రాణికి సమర్పించడానికి రొట్టెలు తయారుచేస్తారు. నా కోపాన్ని రెచ్చగొట్టడానికి వారు ఇతర దేవుళ్ళకు పానార్పణలు పోస్తారు.


అందుకు నేను వారిని శిక్షించకూడదా? ఇలాంటి దేశంపై నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“ ‘ఇశ్రాయేలు ఇంటివారలారా! ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు నా మాట వినకపోతే మీరు వెళ్లి మీ విగ్రహాలను పూజించండి. కాని మీ అర్పణల వలన విగ్రహాల వలన నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయకండి.


చెక్కను చూసి, ‘ప్రాణం తెచ్చుకో’ అని నిర్జీవమైన రాయితో, ‘మేలుకో’ అని చెప్పేవానికి శ్రమ! అది దారి చూపించగలదా? అది బంగారం వెండితో పూత వేయబడింది; దానిలో శ్వాస లేదు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ