Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 47:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు, వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 ‘నేను శాశ్వతంగా జీవిస్తాను. శాశ్వతంగా నేను రాణిగానే ఉంటాను’ అని నీవు చెప్పావు. నీవు ఆ ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు గమనించలేదు. ఏమి జరుగుతుందో అని నీవు గమనించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 47:7
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

దానికి బదులు, ఫరో తన రాజభవనానికి తిరిగి వెళ్లిపోయాడు, కనీసం జరిగిన వాటి గురించి ఆలోచించలేదు.


కాబట్టి ఆయన వారిమీద తన కోపాగ్నిని యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించారు. అది వారి చుట్టూ మంటలతో చుట్టుకుంది, అయినా వారు గ్రహించలేదు; అది వారిని కాల్చింది, కాని వారు దాన్ని పట్టించుకోలేదు.


“బబులోనీయుల రాణి పట్టణమా, మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; రాజ్యాలకు రాణివని ఇకపై నీవు పిలువబడవు.


నీతిమంతులు నశిస్తారు, ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు; భక్తులు మాయమైపోతారు, కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడడం ఎవరూ గ్రహించరు.


“మీరు ఎవరికి జడిసి భయపడి నా పట్ల నిజాయితీగా లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా దీనిని పట్టించుకోకుండా ఉన్నారు? చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని మీరు నాకు భయపడడం లేదు కదా?


ప్రవక్తలు అబద్ధాలను ప్రవచిస్తున్నారు, యాజకులు తమ సొంత అధికారంతో పరిపాలిస్తున్నారు, నా ప్రజలు ఇలాగే ఇష్టపడుతున్నారు. అయితే చివరికి మీరేం చేస్తారు?


ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది; ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది; ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. “యెహోవా, నా బాధను చూడు, ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.”


“మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.


‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా, నేను నీకు విరోధిని. “నైలు నది నాదే, నేనే దాన్ని చేశానని నీవు అంటావు.”


“మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే: “ ‘అంతం! అంతం వచ్చేసింది దేశం నలువైపులా వచ్చేసింది!


పన్నెండు నెలల తర్వాత, రాజు బబులోను రాజభవనం పైకప్పు మీద నడుస్తూ,


నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను.


వారు తెలివైన వారైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, వారి అంతం ఏమిటో వివేచిస్తారు!


ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. ఎందుకంటే, ఆమె తన హృదయంలో, ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. నేను విధవరాలిని కాను, ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ