యెషయా 45:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 యెహోవా చెప్పే మాట ఇదే: “ఈజిప్టు సంపాదన, కూషు వ్యాపార లాభాలు, పొడవైన సెబాయీయులు; నీ దగ్గరకు వచ్చి నీవారవుతారు; సంకెళ్ళతో నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట మోకరిస్తారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నారు, వేరే ఎవరూ లేరు; వేరే ఏ దేవుడు లేడు’ అని నీ ఎదుట నమస్కారం చేసి మనవి చేస్తారు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురువారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు –నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు “ఐగుప్తీయుల సంపాదన, కూషు వ్యాపార లాభాలు, నీకు దొరుకుతాయి. ఎత్తుగా ఉండే సెబాయీయులు నీకు లొంగిపోతారు. వారు సంకెళ్ళతో నీవెంట వచ్చి నీకు సాగిలపడతారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన తప్ప మరి ఏ దేవుడూ లేడు’ అని చెబుతూ నిన్ను వేడుకుంటారు.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 యెహోవా చెబుతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాటిని పొందుతారు. ఆజానుబాహులైన సెబా ప్రజలు మీ వాళ్లవుతారు. వారు మెడలలో సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు. వాళ్లు మీ ఎదుట సాష్టంగపడతారు. వాళ్లు మీకు విన్నపం చేసుకొంటారు.” ఇశ్రాయేలూ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి ఇంకే దేవుడూ లేడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 యెహోవా చెప్పే మాట ఇదే: “ఈజిప్టు సంపాదన, కూషు వ్యాపార లాభాలు, పొడవైన సెబాయీయులు; నీ దగ్గరకు వచ్చి నీవారవుతారు; సంకెళ్ళతో నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట మోకరిస్తారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నారు, వేరే ఎవరూ లేరు; వేరే ఏ దేవుడు లేడు’ అని నీ ఎదుట నమస్కారం చేసి మనవి చేస్తారు.” အခန်းကိုကြည့်ပါ။ |