Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 44:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 నిన్ను పుట్టించి, గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసేవాడైన యెహోవా చెప్పే మాట ఇదే: నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడకు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న యెషూరూనూ, భయపడకు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 నేను యెహోవాను, నేనే నిన్ను సృజించాను. నీవు ఏమై యున్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన వాడను నేనే. నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి నేను నీకు సహాయం చేశాను. యాకోబూ, నా సేవకా, భయపడవద్దు. యెషూరూనూ నిన్ను నేను ఏర్పాటు చేసుకొన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 నిన్ను పుట్టించి, గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసేవాడైన యెహోవా చెప్పే మాట ఇదే: నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడకు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 44:2
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందులో దేవుడున్నారు, అది కూలదు; తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.


పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను; నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే. నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.


రండి, సాగిలపడి ఆరాధించుదాం, మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;


దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. వారి సృష్టికర్త వారికి దయ చూపించరు.


కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; దిగులుపడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.


భయపడకు, పురుగులాంటి యాకోబూ! కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.


“అయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఏర్పరచుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము వారసులారా,


అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.


వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.


భయపడకు, నేను నీతో ఉన్నాను; తూర్పు నుండి నీ సంతానాన్ని తీసుకువస్తాను, పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.


నా పేరుపెట్టబడిన వారందరిని, నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని, నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి.”


“యాకోబూ, వీటిని గుర్తు చేసుకో, ఎందుకంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. నేను నిన్ను నిర్మించాను, నీవు నా సేవకుడవు; ఇశ్రాయేలూ, నేను నిన్ను మరచిపోను.


“నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవాను నేనే అన్నిటిని సృష్టించాను, నేనే ఆకాశాలను విశాలపరిచాను నేను నేనే భూమికి ఆకారమిచ్చాను.


“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దానిని సృష్టించిన యెహోవా చెప్పే మాట ఇదే: జరుగబోయే వాటి గురించి, నా కుమారుల గురించి నన్ను అడుగుతారా? నా చేతిపనుల గురించి నన్నే ఆజ్ఞాపిస్తారా?


ద్వీపాల్లారా, నా మాట వినండి; దూరంగా ఉన్న దేశాల్లారా, ఇది వినండి: నేను పుట్టక ముందే యెహోవా నన్ను పిలిచారు. నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నా పేరు పలికారు.


యెహోవా దృష్టిలో నేను ఘనపరచబడ్డను నా దేవుడే నాకు బలంగా ఉన్నారు తన దగ్గరకు యాకోబును తిరిగి రప్పించడానికి ఇశ్రాయేలును తన కోసం సమకూర్చడానికి తన సేవకునిగా ఉండడానికి నన్ను గర్భంలో నిర్మించిన, యెహోవా ఇలా అంటున్నారు:


“గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.


“ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.


“చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు.


ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు.


మనం ఆయన దృష్టిలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని లోకం సృష్టించబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు.


యెషూరూను క్రొవ్వుపట్టి కాలు జాడించాడు; తిండి ఎక్కువై, వారు బలిసి మొద్దులయ్యారు. వారు తమను చేసిన దేవున్ని విసర్జించి రక్షకుడైన తమ ఆశ్రయ దుర్గాన్ని తృణీకరించారు.


“యెషూరూను దేవుని పోలినవారు ఎవరు లేరు, ఆకాశవాహనుడై వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశం గుండా వస్తారు, తన తేజస్సుతో మేఘాలపై వస్తారు.


ప్రజల నాయకులు, ఇశ్రాయేలు గోత్రాలతో పాటు సమావేశమైనప్పుడు ఆయన యెషూరూనుకు రాజుగా ఉన్నాడు.


దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు.


కాబట్టి మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ