Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 37:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి, అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 యెహోవా, ఈ లోకంలో నీవే, నిజంగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని మనుషులంతా గ్రహించేలా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 కానీ నీవు యెహోవా, మా దేవుడివి. కనుక అష్షూరు రాజు బలంనుండి దయతో మమ్మల్ని రక్షించు. అప్పుడు నీవే యెహోవా అని, నీవు మాత్రమే దేవుడవు అని మిగిలిన రాజ్యాలన్నీ తెలుసుకొంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి, అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 37:20
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు.


ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి!


అప్పుడు ప్రపంచంలోని అన్ని జనాంగాలు యెహోవాయే దేవుడని, వేరెవరు లేరని తెలుసుకుంటారు.


“ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.”


మీ ఉగ్రతలో వారిని దహించివేయండి, వారు ఇక లేకుండునంతగా వారిని దహించివేయండి. అప్పుడు దేవుడు యాకోబును పరిపాలిస్తున్నారని భూదిగంతాల వరకు తెలియపరచబడుతుంది. సెలా


ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”


యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.


భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”


“సైన్యాల యెహోవా! ఇశ్రాయేలు దేవా! కెరూబుల మధ్యలో సింహాసనాసీనుడా! ఈ లోక రాజ్యాలకు మీరు మాత్రమే దేవుడు. మీరు భూమ్యాకాశాలను సృష్టించారు.


“నేనే యెహోవాను. అదే నా పేరు! నా మహిమను నేను మరొకరికి ఇవ్వను నాకు రావలసిన స్తుతులను విగ్రహాలకు చెందనివ్వను.


నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; నేను తప్ప ఏ దేవుడు లేడు. నీవు నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను బలపరుస్తాను.


మీ మూలంగా ఇతర ప్రజల్లో అవమానపరచబడుతున్న నా గొప్ప పేరు ఎంత పరిశుద్ధమైనదో మీకు చూపిస్తాను. వారి కళ్ళెదుట మీ ద్వారా నా పరిశుద్ధతను వెల్లడి చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


“నా మహిమను ఇతర ప్రజలమధ్య చూపుతాను. ఇతర ప్రజలందరు నేను విధించిన శిక్షను నేను వారిపై ఉంచిన చేతిని చూస్తారు.


యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”


తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ