Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 36:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 “హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 హిజ్కియా చెప్పిన ఆ మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు చెబుతున్నదేమిటంటే, మీరు బయటికి వచ్చి, నాతో సంధి చేసుకోండి. అప్పుడు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్ష, అంజూరు చెట్ల పండ్లు తింటూ తన బావిలో నీళ్లు తాగుతూ ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 “హిజ్కియా చెప్పే ఆ మాటలు వినవద్దు. అష్షూరు రాజు మాట వినండి. అష్షూరు రాజు చెబుతున్నాడు, ‘మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. ప్రజలారా, మీరు పట్టణం వదలి పెట్టి నా దగ్గరకు రండి. అప్పుడు ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఇంటికి వెళ్లవచ్చును. ప్రతి ఒక్కరు తన స్వంత ద్రాక్షవల్లినుండి ద్రాక్షపండ్లు తినేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత అంజూరపు చెట్టు ఫలాలు తినే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత బావి నుండి నీళ్లు తాగే స్వేచ్ఛ ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 “హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 36:16
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు తప్పకుండ ఈ మాట చెప్పాలి, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనుక వస్తున్నాడు.’ ” ఎందుకంటే అతడు, “నేను ముందుగా పంపుతున్న ఈ బహుమతులతో నేను అతన్ని శాంతింపజేస్తాను; తర్వాత, నేను అతన్ని చూసినప్పుడు, బహుశ అతడు నన్ను చేర్చుకుంటాడు” అని అనుకున్నాడు.


దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను స్వీకరించు, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించారు, నాకు అవసరమైనది నా దగ్గర ఉన్నది.” యాకోబు పట్టుబట్టడంతో ఏశావు దానిని స్వీకరించాడు.


దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా, అరామీయులు అతనికి దాసులై కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు.


యూదా, ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారంగా ఉండి తిని త్రాగుతూ సంతోషిస్తూ ఉన్నారు.


సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు.


“హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు.


అప్పుడు నయమాను, అతని సేవకులందరు దైవజనుని దగ్గరకు తిరిగి వెళ్లారు. నయమాను అతని ఎదుట నిలబడి, “ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరో దేవుడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీ దాసుడనైన నేను ఇచ్చే ఈ కానుక అంగీకరించండి.”


అంజూర చెట్టును పెంచేవాడు దాని ఫలం తింటాడు, తన యజమానుని క్షమించేవాడు ఘనత పొందుతాడు.


మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.


తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం.


ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు క్రింద, తమ అంజూర చెట్టు క్రింద కూర్చుంటారు, ఎవరూ వారిని భయపెట్టరు, ఎందుకంటే సైన్యాల యెహోవా మాట ఇచ్చారు.


“ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”


అందుకే, మీరు వాగ్దానం చేసిన కానుకలు అయిష్టంగా కాకుండా దాతృత్వంతో ఇచ్చేలా సిద్ధపడి ఉండడానికి ప్రోత్సహించేలా మీ దగ్గరకు ముందుగానే సహోదరులను పంపడం అవసరమని నేను అనుకున్నాను.


అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.


మీ సేవకురాలినైన నేను నా ప్రభువైన మీకు తెచ్చిన ఈ కానుకను మీ వెంట ఉన్న మీ సేవకులకు ఇవ్వనివ్వండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ