Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 33:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 అక్కడ యెహోవా మన బలాఢ్యుడైన రాజుగా ఉంటారు. అది విశాలమైన నదులు, వాగులు ఉన్న స్థలంగా ఉంటుంది. వాటిలో తెడ్ల ఓడ నడువదు వాటిలో ఏ పెద్ద నౌక ప్రయాణించదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 దానికి ప్రతిగా విశాలమైన నదులూ, నీటి వాగులూ ఉన్న ఆ స్థలంలో యెహోవా తన ప్రభావంతో మనతో ఉంటాడు. తెడ్లు వేసుకుంటూ అక్కడ ఏ యుద్ధనౌకా ప్రయాణించదు. పెద్ద నౌకలేవీ అక్కడ ప్రయాణించవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21-23 ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 అక్కడ యెహోవా మన బలాఢ్యుడైన రాజుగా ఉంటారు. అది విశాలమైన నదులు, వాగులు ఉన్న స్థలంగా ఉంటుంది. వాటిలో తెడ్ల ఓడ నడువదు వాటిలో ఏ పెద్ద నౌక ప్రయాణించదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 33:21
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది; మహిమగల దేవుడు ఉరుముతారు మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


మీ కళ్లు రాజును అతని వైభవంలో చూస్తాయి, విశాలంగా విస్తరించిన దేశాన్ని చూస్తాయి.


నేను చెట్లులేని ఎత్తు స్థలాల మీద నదులను ప్రవహింపచేస్తాను, లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. ఎడారిని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను ఊటలుగా చేస్తాను.


చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను! ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా? నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.


నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి అడవి జంతువులు, నక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి.


నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే నీ సమాధానం నదిలా నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి.


యెహోవా చెప్పే మాట ఇదే: “వినండి. ఆమె దగ్గరకు సమాధానం నదిలా ప్రవహించేలా చేస్తాను, దేశాల సంపదలు పొంగిపొర్లే ప్రవాహంలా వస్తాయి; మీరు పోషించబడి ఆమె చంకనెక్కుతారు ఆమె మోకాళ్లమీద ఆడుకుంటారు.


నేను వారి మీద నా చేయి ఎత్తుతాను అప్పుడు వారి బానిసలు వారిని దోచుకుంటారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.


“యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు, ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు; రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది.


అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై,


బానిసలు మిమ్మల్ని ఆశ్రయిస్తే, వారిని వారి యజమానికి అప్పగించవద్దు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ