Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 33:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 మీ తలంపులలో మీ గత భయాన్ని గుర్తుచేసుకుంటారు: “ఆ ప్రధానాధికారి ఎక్కడ ఉన్నాడు? ఆదాయాన్ని తీసుకున్నవారు ఎక్కడ? గోపురాల అధికారి ఎక్కడ?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 నీ హృదయం భయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. శాస్త్రి ఎక్కడ ఉన్నాడు? డబ్బును తూచిన వాడు ఎక్కడ ఉన్నాడు? గోపురాలను లెక్కించేవాడు ఎక్కడ ఉన్నాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18-19 గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కించిన ఆ గూఢచారులు ఎక్కడ? వాళ్లంతా పోయారు!” అని మీరు అనుకొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 మీ తలంపులలో మీ గత భయాన్ని గుర్తుచేసుకుంటారు: “ఆ ప్రధానాధికారి ఎక్కడ ఉన్నాడు? ఆదాయాన్ని తీసుకున్నవారు ఎక్కడ? గోపురాల అధికారి ఎక్కడ?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 33:18
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు.


తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.


కాబట్టి యూదా రాజైన హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరకు, “నేను తప్పు చేశాను. నా దగ్గర నుండి నీవు వెనుకకు వెళ్లిపో, నీవు నా నుండి ఏమి కోరిన అది ఇస్తాను” అని సందేశం పంపాడు. అష్షూరు రాజు మూడువందలు తలాంతుల వెండి, ముప్పై తలాంతుల బంగారం యూదా రాజైన హిజ్కియా చెల్లించాలని విధించాడు.


“హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు.


“మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” అని నేను ఆందోళన చెందాను. సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు నా విన్నపాన్ని విన్నారు.


మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు, చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ, మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు; భూమి యొక్క లోతుల నుండి మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు.


సాయంకాలంలో ఆకస్మిక భయం! ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే.


నీవు నీతిలో స్థాపించబడతావు: బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీవు దేనికి భయపడే అవసరం లేదు. భయం నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు.


జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా?


హింసలు, శ్రమలు అంటే, అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్ర ప్రాంతాల్లో నాకు కలిగిన హింసను నేను ఎలా సహించానో అన్ని నీకు తెలుసు. అయితే ప్రభువు వాటన్నిటి నుండి నన్ను తప్పించారు.


అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ