Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 30:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతోకూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 చూడండి! ఆయన ఆగ్రహంతో మండిపోతూ దట్టమైన పొగతో యెహోవా పేరు దూరం నుండి వస్తూ ఉంది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి పోయాయి. ఆయన నాలుక దహించే అగ్ని జ్వాలలా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

27 చూడండి! చాలా దూరం నుండి యెహోవా పేరు వస్తోంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘాలతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు కోపంతో నిండి ఉంది, ఆయన నాలుక మండుతోన్న మంటలా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 30:27
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా? ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?


అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండం నా ఉగ్రత అనే దుడ్డుకర్ర అతని చేతిలో ఉంది.


దేశాన్ని మొత్తం పాడుచేయడానికి, యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా, వారు దూరదేశం నుండి, ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు.


ప్రజలు కాలి బూడిద అవుతారు; వారు నరకబడిన ముళ్ళపొదల్లా కాల్చబడతారు.”


సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; భక్తిహీనులకు వణుకు పుడుతుంది. “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?”


ఎదోము నీటిప్రవాహాలు కీలుగా దాని మట్టి మండుతున్న గంధకంగా మారుతుంది. దాని భూమి మండుతున్న కీలుగా ఉంటుంది.


నీవు నీళ్లను దాటుతున్నప్పుడు నేను నీతో ఉంటాను; నీవు నదులను దాటుతున్నప్పుడు అవి నిన్ను ముంచవు. నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు నీవు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చవు.


పశ్చిమలో ఉన్నవారు యెహోవా నామానికి భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమను గౌరవిస్తారు. యెహోవా ఊపిరి తీసుకువచ్చే ఉధృతమైన వరదలా ఆయన వస్తారు.


మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది.


చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నారు, ఆయన రథాలు సుడిగాలిలా వస్తున్నాయి. ఆయన తన కోపాన్ని తీవ్రతతో క్రిందికి తెస్తున్నారు, ఆయన గద్దింపు అగ్ని మంటలతో వస్తుంది.


యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు రక్తంలో చుట్టబడిన బట్టలు మంటలో వేయబడతాయి అగ్నికి ఇంధనంగా అవుతాయి.


మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి, మీ హృదయాలను సున్నతి చేసుకోండి, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, లేకపోతే మీరు చేసిన చెడును బట్టి నా కోపం అగ్నిలా మండుతుంది, ఆర్పడానికి ఎవరూ ఉండరు.


కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”


ఆయన ఎదుట నుండి అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది, వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు; పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు, న్యాయసభ మొదలైంది, గ్రంధాలు విప్పారు.


“నేను చూస్తుండగా, “సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి, వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు. ఆయన వస్త్రం మంచులా తెల్లగా, ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది, దాని చక్రాలు మండుతూ ఉన్నాయి.


కాబట్టి నా కోసం వేచి ఉండండి,” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడే రోజు కోసం వేచి ఉండండి. నేను దేశాలను పోగుచేయాలని, రాజ్యాలను సమకూర్చాలని వాటి మీద నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని కుమ్మరించాలని నిర్ణయించుకున్నాను. రోషంతో కూడిన నా కోపానికి లోకమంతా దహించబడుతుంది.


తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


ఎందుకంటే నా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది, పాతాళం వరకు అది మండుతుంది. అది భూమిని దాని పంటను మ్రింగివేస్తుంది పర్వతాల పునాదులకు నిప్పు పెడుతుంది.


అతడు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు శేయీరు నుండి వారి మీద ఉదయించారు; పారాను పర్వతం నుండి ప్రకాశించారు. వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు, దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.


ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, ఆయన రోషం గల దేవుడు.


ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.


ఎందుకంటే మన “దేవుడు దహించు అగ్ని.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ