Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 26:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 బిడ్డని కనే సమయం దగ్గర పడినప్పుడు గర్భవతి వేదనతో కేకలు పెట్టినట్టుగానే ప్రభూ, మేం కూడా నీ సన్నిధిలో వేదన పడ్డాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 యెహోవా, మేం నీతో లేనప్పుడు మేం ప్రసవవేదన పడుతున్న స్త్రీలా ఉంటాం ఆమె ఏడుస్తుంది, ప్రసవ బాధ పడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 26:17
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.”


వారిలో వణుకు పుట్టింది, ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.


భయం వారిని పట్టుకుంటుంది, వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి; స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు. వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు, వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి.


కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.


వారు అతనితో ఇలా అన్నారు, “హిజ్కియా చెప్పిన మాట ఇదే: ఈ రోజు బాధ, చీవాట్లు, అవమానం ఉన్న రోజు, బిడ్డ పుట్టడానికి సమయం దగ్గరకు వచ్చినా కనే శక్తిలేని స్త్రీలా ఉంది.


ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి?


ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, ఊపిరి కోసం అల్లాడుతూ, సీయోను కుమారి తన చేతులు చాచి, “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.


మేము వారి గురించిన వార్తలను విన్నాము, మా చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన మమ్మల్ని పట్టుకుంది.


ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతుంది; కానీ శిశువు పుట్టగానే తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదనంతా ఆమె మరచిపోతుంది.


ప్రజలు, మేము, “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణి స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి వారు దాని నుండి తప్పించుకోలేరు.


ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ