Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 26:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు– బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు. “మనకి ఒక బలమైన పట్టణం ఉంది. దేవుడు రక్షణను దాని గోడలుగానూ ప్రాకారాలుగానూ చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ఆ సమయమందు యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు: యెహోవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక బలమైన పట్టణం ఉంది. మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 26:1
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.


యెహోవాకు స్తుతి, ఎందుకంటే ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు.


సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి, దాని బురుజులెన్నో లెక్కించండి.


రాజులు దళాలతో కలిసి, వారు ముందుకు వచ్చినప్పుడు,


ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీరు నాపై కోప్పడినా కూడా మీ కోపం చల్లారింది మీరు నన్ను ఆదరించారు.


గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి! ఫిలిష్తియా, మీరంతా కరిగిపోవాలి! ఉత్తర దిక్కునుండి పొగలేస్తుంది. పంక్తులు తీరిన సైన్యంలో వెనుదిరిగేవారు ఎవరూ లేరు.


మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.


ఆ రోజున మనుష్యులు తాము పూజించడానికి తయారుచేసుకున్న వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.


ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”


అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు; ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు. దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు.


వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది; వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు” అని యెహోవా ప్రకటించారు. సీయోనులో ఆయన అగ్ని యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి.


యెహోవా ఘనత పొందుతారు, ఆయన ఎత్తైన చోట నివసిస్తారు; ఆయన తన న్యాయంతో, నీతితో సీయోనును నింపుతారు.


ఆయన నీ కాలాల్లో స్థిరమైన పునాది, విస్తారమైన రక్షణ బుద్ధి జ్ఞానాలు ఇస్తారు. యెహోవా భయం ఈ సంపదకు మూలము.


ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది.


నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.


నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.


ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.


రండి, గుమ్మాల ద్వారా రండి! ప్రజలకు మార్గం సిద్ధపరచండి. నిర్మించండి, రహదారిని నిర్మించండి! రాళ్లను తొలగించండి. దేశాలు చూసేలా జెండాను ఎత్తండి.


భూమి అంచుల వరకు యెహోవా చేస్తున్న ప్రకటన: “ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు! ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని సీయోను కుమార్తెతో చెప్పండి.”


సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు.


ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది.


నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివసించి దానికి ఘనతగా ఉంటాను’ అని యెహోవా చెప్తున్నారు.


నేను వారి మీద నా చేయి ఎత్తుతాను అప్పుడు వారి బానిసలు వారిని దోచుకుంటారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.


అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు: “ఓ బావి ఉప్పొంగు! దాని గురించి పాడండి.


నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ