Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 25:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఈ పర్వతంపై సేనల ప్రభువు యెహోవా ప్రజలందరి కోసం కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేస్తాడు. మూలుగు ఉన్న కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 25:6
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీ మందిరంలోని సమృద్ధి వల్ల వారు సంతృప్తి పొందుతున్నారు; మీ ఆనంద నది నుండి మీరు వారికి త్రాగడానికి ఇస్తారు.


శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.


కాని ఆయన యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు.


అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే ఆహ్లాదకరమైనది.


నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!


నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. నేను తేనెతెట్టె తేనె తిన్నాను; నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. స్నేహితులారా, తినండి త్రాగండి; ప్రేమికులారా! తృప్తిగా సేవించండి.


మీరు ఇష్టపడి నా మాట వింటే, మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు;


యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది; అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు, మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు.


నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”


“మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.”


ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.


యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోనుకు తిరిగివచ్చి యెరూషలేములో నివసిస్తాను. అప్పుడు యెరూషలేము నమ్మకమైన పట్టణమని, సైన్యాల యెహోవా పర్వతమని, పవిత్ర పర్వతమని పిలువబడుతుంది.”


నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.”


అనేకులు తూర్పు పడమర నుండి వచ్చి పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు.


యేసు వారితో, “మీరు సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి.


పాత ద్రాక్షరసం త్రాగినవారు ఎవ్వరూ క్రొత్త దానిని కోరరు, ‘పాతదే బాగుంది’ అని అంటారు” అని అన్నారు.


అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.


ఆ తర్వాత దేవదూత నాతో, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం పొందినవారు ధన్యులు! ఇది వ్రాయి. ఇవి దేవుని సత్య వాక్కులు” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ