Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 25:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లు వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. వారి చేతులు యుక్తితో ఉన్నా దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లువారు దానిమధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవావారి గర్వమును అణచివేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఈతగాళ్ళు ఈదడానికి తమ చేతులను చాపినట్టు వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. వారెన్ని తంత్రాలు పన్నినా యెహోవా వారి గర్వం అణచివేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 ఈత కొట్టేవానిలా యెహోవా తన చేతులు చాపుతాడు అప్పుడు ప్రజలు అతిశయించే వాటన్నిటినీ యెహోవా సమకూరుస్తాడు వారు తయారు చేసిన అందమైన వాటన్నింటినీ యెహోవా సమకూరుస్తాడు. యెహోవా వాటన్నింటినీ క్రింద పారవేస్తాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లు వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. వారి చేతులు యుక్తితో ఉన్నా దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 25:11
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు,


ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,


చూడండి, ప్రభువు, సైన్యాల అధిపతియైన యెహోవా మహాబలంతో కొమ్మలు నరుకుతారు. ఉన్నతమైన చెట్లు నరకబడతాయి, ఎత్తైనవి పడగొట్టబడతాయి.


దాని చెడుతనం బట్టి లోకాన్ని వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను. క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను.


లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే; ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే.


అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”


మోయాబు గర్వం గురించి మేము విన్నాము దాని అహంకారం చాలా ఎక్కువ దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం; అయితే దాని ప్రగల్భాలు వట్టివే.


యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి.


మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.


ఉన్నతమైన ప్రతి గోపురానికి ప్రతి కోటగోడకు,


ఎడారి వేడిలా ఉంటుంది. మీరు విదేశీయుల ప్రగల్భాలను అణచివేశారు; మేఘాల నీడ ద్వారా వేడి తగ్గునట్లు క్రూరుల పాట నిలిపివేయబడుతుంది.


కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది; ఆయన వారి మీదికి తన చేయి చాచి వారిని కొడతారు. పర్వతాలు వణుకుతాయి, వీధుల్లో వారి శవాలు పెంటలా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.


కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను. బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు, అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు. అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ, అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు.


తమ ఊహల ప్రకారం చేస్తూ చెడు మార్గంలో నడుస్తూ ఉన్న మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను.


“మోయాబు గర్వం గురించి దానికి అహంకారం గురించి దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం, దాని హృదయ అతిశయం గురించి విన్నాము.


మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది.


“అయితే నేను రాబోయే రోజుల్లో మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.


నేను బబులోనులో బేలును శిక్షిస్తాను అతడు మ్రింగివేసిన దాన్ని బయటకు కక్కేలా చేస్తాను. దేశాలు అతని దగ్గరకు ఇక గుంపులుగా రావు. బబులోను గోడ కూలిపోతుంది.


ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.


ఆయన సిలువ ద్వారా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, వారు బహిరంగంగా సిగ్గుపడునట్లు చేసి, సిలువ చేత వారిపై విజయాన్ని ప్రకటించారు.


అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తారు కాబట్టి, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని, దీనులకు దయ చూపిస్తారు” అని లేఖనం చెప్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ