Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 24:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఒలీవ చెట్టును దులిపేటప్పుడు, ద్రాక్షకోత అయిన తరువాత పరిగె పళ్ళు ఏరు కొనేటప్పుడు జరిగేలా లోక జాతులన్నిటిలో జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. కానీ చెట్లకు కొన్ని ఒలీవ పండ్లే మిగిలి ఉన్నాయి. రాజ్యాల మధ్య ఈ దేశానికి కూడ అలానే ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 24:13
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.


“ఆ రోజున యాకోబు ప్రభావం తగ్గిపోతుంది; అతని శరీరం యొక్క క్రొవ్వు తరిగిపోతుంది.


ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు.


దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా అది కూడా నాశనమవుతుంది. అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత మొద్దులు ఎలా మిగులుతాయో అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.”


ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.


వాటినుండి తప్పించుకున్నవారు పర్వతాల మీదకు పారిపోయి తమ పాపాలను బట్టి వారిలో ప్రతి ఒక్కరు లోయ పావురాల్లా మూల్గుతారు.


“ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం యొక్క అంచులకు కోయవద్దు లేదా మీ పంట కోతల యొక్క పరిగెలను సేకరించవద్దు.


“యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను; నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను. నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను, ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది.


ఏంటి నా దుస్థితి! నా పరిస్థితి వేసవికాలపు పండ్లు ఏరుకునే వానిలా ద్రాక్షతోట పరిగె సేకరించేవానిలా ఉంది; తినడానికి ద్రాక్షపండ్ల గెల లేదు, నేను ఆశించే క్రొత్త అంజూరపు పండ్లు లేవు.


“ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు, అయితే ఎన్నుకోబడినవారి కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.


అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కాబట్టి వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ