Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 19:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 యెహోవా వారి మీద భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 యెహోవా వాళ్ళ ఆలోచనలను తారుమారు చేసే ఆత్మను వాళ్ళ మనస్సుల్లో పెట్టాడు. మత్తులో తూలే తాగుబోతు తన వాంతిలో పొర్లినట్టు ఐగుప్తు చేసే పని అంతట్లో వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 యెహోవా వారి మీద భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 19:14
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

“కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తల నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”


బలం వివేకం ఆయనకు చెందినవే; మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.


వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు; ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు.


మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.


“నేను ఈజిప్టువారి మీదికి ఈజిప్టువారిని రేపుతాను, సోదరుని మీదికి సోదరుడు, పొరుగువారి మీదికి పొరుగువారు, పట్టణం మీదికి పట్టణం, రాజ్యం మీదికి రాజ్యం రేపుతాను.


భూమి త్రాగుబోతులా తూలుతుంది, గాలికి ఊగే పాకలా ఇటు అటు ఊగుతుంది. దాని తిరుగుబాటు అపరాధం దానిపై బరువుగా ఉంది అది ఇక లేవనంతగా పడిపోతుంది.


కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది వివేకుల వివేకం మాయమైపోతుంది.”


నా ప్రజలను యువకులు అణచివేస్తారు స్త్రీలు వారిని పాలిస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు మార్గం నుండి వారు మిమ్మల్ని తప్పిస్తారు.


ఈ ప్రజలను నడిపించేవారు వారిని తప్పుదారి పట్టిస్తారు; వారిని వెంబడించేవారు చెదిరిపోతారు.


“అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’


“ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి, ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది. మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది; ఆమె హేళన చేయబడుతుంది.


అందుకు యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు.


ఈ కారణంగా, వారు అబద్ధాన్ని నమ్మేలా దేవుడు వారి మీదకు బలమైన భ్రమను పంపాడు.


దేవుడు అబీమెలెకుకు, షెకెము పౌరులకు వైరం కలిగించారు, కాబట్టి వారు అబీమెలెకుకు ద్రోహం చేశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ