Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 13:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు తమ వెలుగు ఇవ్వవు. ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు చంద్రుడు తన వెలుగునివ్వడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 ఆకాశాలు చీకటి అవుతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశించవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు తమ వెలుగు ఇవ్వవు. ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు చంద్రుడు తన వెలుగునివ్వడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 13:10
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.


ఆ రోజున యెహోవా పైన ఆకాశాల్లో ఉన్న శక్తులను, భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు.


చంద్రుడు దిగులు చెందుతాడు సూర్యుడు సిగ్గుపడతాడు; సైన్యాల యెహోవా సీయోను కొండమీద యెరూషలేములో, దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.


“బబులోనీయుల రాణి పట్టణమా, మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; రాజ్యాలకు రాణివని ఇకపై నీవు పిలువబడవు.


వారు ఆ రోజు సముద్ర ఘోషలా తమ శత్రువు మీద గర్జిస్తారు. ఒకవేళ ఎవరైనా భూమివైపు చూస్తే, అక్కడ చీకటి, బాధ మాత్రమే కనబడుతుంది; మేఘాలు కమ్మి వెలుగు కూడా చీకటిగా అవుతుంది.


ఆకాశాలకు చీకటి కమ్మేలా చేస్తాను దానిని గోనెపట్టతో కప్పుతాను.”


వాటికి ముందు భూమి కంపిస్తుంది, ఆకాశాలు వణకుతాయి, సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుంది. నక్షత్రాలు ఇక ప్రకాశించవు.


యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు, సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.


సూర్యచంద్రులు చీకటిగా మారుతాయి, నక్షత్రాలు ఇక ప్రకాశించవు.


యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా?


అయితే పొంగిపొరలే వరదతో నీనెవెను అంతం చేస్తారు; ఆయన తన శత్రువులను చీకటిలోకి తరుముతారు.


ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు.


“ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’


“కాని ఆ దినాల్లో, ఆ శ్రమకాలం తర్వాత, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు.


“ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి.


మహా మహిమగల ప్రభువు దినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.


నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడవ భాగం, చంద్రుని మూడవ భాగం, నక్షత్రాల మూడవ భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి అవన్నీ మూడవ భాగం వెలుగును కోల్పోయాయి. పగటి వెలుగులో మూడవ భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ