Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 1:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ధ తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 1:6
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము వంటి అందమైనవారు ఇంకెవరు లేరు. అరికాలు నుండి నడినెత్తి వరకు అతనిలో ఏ లోపం లేదు.


గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే; ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.


నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.


యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.


హృదయం అన్నిటికంటే మోసకరమైనది నయం చేయలేని వ్యాధి కలది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది.


నీ గాయం గురించి, తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా నేను నీకు ఇవన్నీ చేశాను.


“ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను.


నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.


బావి తన నీళ్లను ఎలా బయటకు ఉబికేలా చేస్తుందో, అలాగే ఆమె తన దుష్టత్వాన్ని కుమ్మరిస్తుంది. హింస, విధ్వంసం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది; ఆమె జబ్బులు, గాయాలు నిత్యం నా ముందు ఉన్నాయి.


ఏదీ నిన్ను స్వస్థపరచలేదు; మీ గాయం ప్రాణాంతకమైనది. మీ గురించిన వార్త విన్నవారందరు మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు, ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.


అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు.


అది విని యేసు, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు.


అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకెళ్లి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ